పార్వతీపురం
భారతీయ జనతాపార్టీ అధ్వర్యంలో గురువారం చెపట్టిన జలం కోసం ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర శుక్రవారం పార్వతీపురానికి చేరుకుంది. ఈ నేపధ్యంలో బిజెపి నేతలు. ఎంపీ జీవీఎల్, రాష్ట్ర ఇన్ చార్జి సునీల్ దేవ్ ధర్, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్ ల వెంట స్థానిక నేతలు జంఝావతి ప్రాజెక్టు రబ్బరు డ్యామును సందర్శించారు. జగనన్న ఇళ్లకాలనీని బిజెపి బృందం దర్శించింది. ఒక ఇంటి వద్ద మోదీ ఫ్లెక్సీ పెట్టిన సోము వీర్రాజు, కేంద్ర నిధులతో కట్టిన ఇళ్ల వద్ద మోదీ ఫ్లెక్సీలు పెట్టి తీరాలని డిమాండ్ చేసారు. అక్కడ జరిగిన సభలొ నాయకులు ప్రసంగించారు. సోము వీర్రాజు మాట్లాడుతూ జంఝావతి కెపాసిటీ నాలుగు టిఎంసిలు. 25 కోట్లతో పాతికవేల ఎకరాలు సాగవుతాయి. ఒడిసాతొ మాటాడి ఒప్పిస్తే మనకు 40 వేల ఎకరాలకు నీరు రావటమే కాక ఒడిసాకూ నాలుగు టిఎంసిలు దక్కుతాయని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గులేదు. ఈ చిన్న ఖర్చులకు ముఖం చాటేసి కేంద్రాన్ని మాత్రం పోలవరం ఖర్చు పెంచి ఇమ్మంటున్నారు. మేము పోలవరం నిర్మిస్తాం. మీకు ఈ చిన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలంటూ ఉద్యమిస్తామని అన్నారు. జిల్లా బిజెపి అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు ఏది అవసరమో తెలియని నాయకులు మాకు ఉండటం మా దురదృష్టం. ఈ జంఝావతికి 100 కోట్లు ఇస్తే ఈ ప్రాంత రైతులంతా లబ్ధిపొందుతారని అన్నారు