గుంటూరు
గుంటూరు జిల్లా లోని పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో మాంసం కలకలం రేపింది. ఆలయ క్యాంటీన్ లో నిర్వాహకులు మాంసాహారం వండిన భాగోతం బయటపడింది. కేటరింగ్ వ్యాపారం చేసే వ్యక్తి క్యాంటీన్ నిర్వహిస్తునట్లు సమాచారం. భక్తులకు అల్పాహారం, అన్నదానం అందించేలా క్యాంటీన్ ను వేలంలో దేవాదాయశాఖ అప్పగించారు. వైసీపీ నేత షరీఫ్ ఇతరుల పేరుతో క్యాంటీన్ దక్కించుకున్నాడు. ఆలయ క్యాంటీన్ లో మాంసాహారం వండి బయటకి సరఫరా చేసినట్లు సమాచారం. స్థానిక భక్తులు గుర్తించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.