యాదాద్రి
యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి నూకలు చెల్లడం ఖాయమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత హెచ్చరించారు. తెలంగాణపై ప్రేమ ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు.కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేవరకు వివిధ రూపాలలో ఆందోళన చేస్తున్నారు అందులో భాగంగా జిల్లా టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు..ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత,ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణ రెడ్డి,ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి,జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, తదితరులు నిరసన దీక్షలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు.తెలంగాణలో పండే వరి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్తో పాటు, నూకలు తినాలంటూ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరుగుతున్నాయి అన్నారు..