విజయవాడ
నంద్యాలలో సిపిఐ, ప్రజాసంఘాల నాయకుల అక్రమ అరెస్టులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. శుక్రవారం ముఖ్యమంత్రి నంద్యాల పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహంతో ముందస్తు అరెస్టులు చేయడం దుర్మార్గమని అయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి పర్యటించేది నిషేధిత ప్రాంతమా? పోలీసులు ముందస్తు అరెస్టులు చేయటానికి వాళ్లేమన్నా తీవ్రవాదులా లేక అరాచక శక్తులా? ఇది ప్రజాస్వామ్యమా? లేక పోలీసు రాజ్యమా? ప్రజాతంత్ర వాదులంతా పోలీసు చర్యలను ఖండించాలని కోరుతున్నామని అయన అన్నారు.