న్యూ ఢిల్లీ ఏప్రిల్ 8
సాలిడ్ ఫ్యూయెల్ డక్టెడ్ రామ్‌జెట్ (ఎస్ఎఫ్‌డీఆర్) బూస్టర్ మిస్సైల్ టెక్నాలజీని ఇవాళ డీఆర్డీవో పరీక్షించింది. ట్రయల్ పరీక్ష సక్సెస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో డీఆర్డీవోకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కంగ్రాట్స్ తెలిపారు. చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సెంటర్ నుంచి ఎస్ఎఫ్‌డీఆర్ బూస్టర్‌ను పరీక్షించారు. ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు ఈ పరీక్ష జరిగింది. మిస్సైల్ సిస్టమ్‌లో ఉన్న అన్ని పరికరాలు నిర్విఘ్నంగా పనిచేసినట్లు డీఆర్డీవో తెలిపింది. అతి సుదీర్ఘ దూరంలో ఉన్న మిస్సైళ్లను ఎస్ఎఫ్‌డీఆర్ అడ్డుకోగలదు. సూపర్ సోనిక్ ధ్వని వేగం కన్నా వేగంగా మిస్సైల్‌ను అడ్డుకుంటుంది. టెలిమెట్రీ, రేడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఇచ్చిన డేటా ఆధారంగా ఎస్ఎఫ్‌డీఆర్ పరీక్ష విజయవంతమైనట్లు తేల్చారు. హైదరాబాద్‌కు చెందిన డీఆర్డీఎల్, ఆర్‌సీఐ ల్యాబ్, పూణెలోని హెచ్ఈఎంఆర్ఎల్ సంస్థలు ఈ కొత్త టెక్నాలజీని డెవలప్ చేశాయి.