YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో అడగడుగునా నిఘా

విశాఖలో అడగడుగునా నిఘా

విశాఖపట్టణం, ఏప్రిల్ 9,
విశాఖలో రోజురోజుకీ పెరిగిపోతున్న నేరాల పట్ల పోలీసులు పౌరుల్ని అప్రమత్తం అవుతున్నారు. అన్నింటా పోలీసులు వుండలేరు కాబట్టి సీసీ టీవీల ద్వారా నేరగాళ్ళు ఆగడాలకు చెక్ పెట్టే పనిలో పడ్డారు. దొంగల ముఠాల పాలిట సింహ స్వప్నం…కిడ్నాపర్ల ఆగడాలకు కళ్ళెం వేసే నిఘా నేత్రాలు..ఈవ్ టీజర్ల, ఆకతాయిలా దుమ్ముదులిపే మూడో కన్ను.. ఇలా నిందితుల పాలిట యమపాశంగా మారాయి సీసీటీవీలు. గంటల వ్యవధిలోనే నేరస్థులను కటకటాల పాలుచేస్తున్నాయి. కేసుల చేధనలో అండగా నిలుస్తున్నాయ్. మంచి సత్పలితాలు ఇస్తుండడంతో మన ఇల్లు-మన భద్రత ద్వారా ప్రజలకు భరోసా నిస్తూ మరింత ఫోకస్ పెట్టింది విశాఖ జిల్లా పోలీస్ యంత్రాంగం.ఏపీ అడ్మినిస్ట్రేటివ్ కాపిటల్‌ గా మారుతున్న విశాఖ నగరంలో నేరాలకు పాల్పడితే పోలీసుల కళ్ల నుంచి తప్పించుకున్నా.. సీసీ కెమెరాల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. విశాఖలో గత కొద్ది నెలల నుండి జరిగిన మేజర్ కేసులన్నీ ఇలా సీసీటీవీ ల ఆధారంగానే చేధించామని అంటున్నారు విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా. కేజీహెచ్ హాస్పిటల్ లో బాలింత వద్ద ఉన్న శిశువుకు ఇంజక్షన్ వేస్తామని చెప్పి ఇద్దరు మహిళలు ఎత్తుకెళ్లారు. ఆ ప్రాంతంలోను, నగరంలోను ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గంటల వ్యవధిలోనే చాకచక్యంగా శ్రీకాకుళంలో పట్టుకున్నారు. సెల్లార్లో పెట్టిన రాయల్ ఎన్‌ ఫీల్డ్ బుల్లెట్ అపహరణకు గురైందని ఓ వ్యక్తి దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటికే పలుస్టేషన్లలో బైక్లను దొంగిలించినట్లు కేసులు నమోదవ్వడంతో ప్రత్యేక క్రైం టీంతో దర్యాప్తు చేయగా, ఆపరేషన్ బుల్లెట్ ద్వారా సీసీ కెమెరాల ఆధారంగా 12 రాయల్ ఎన్ ఫీల్డ్ లు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అంతే కాదు గతేడాది లో ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఎంవీపీ కాలనీలో 11 చోరీలు జరిగాయి. ఇన్ని దొంగతనాలు చేసిన ఆ రాజరాజ చోర మాత్రం దొరక్కుండా తిరిగేవాడు, చాకచక్యంగా తప్పించుకున్నాడు. కానీ చివరికి డిసెంబర్ 28న శివాజీపా లెంలో చోరీ చేస్తుండగా సీసీ కెమెరాలకు చిక్కాడు. వాటి ఆధారంగా దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఇలా ఇంకా ఎన్నో మేజర్ కేసులను పోలీసులు సీసీటీవీ ఆధారంగా చేధించిన సంఘటనలు ఉన్నాయి.నేర నియంత్రణే లక్ష్యంగా టెక్నాలజీని అంది పుచ్చుకుంటూ పోలీసులు ముందుకెళ్తున్నారు. ప్రధానంగా నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడం, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడం, ఈవ్ టీజర్స్ ఆటకట్టించడం, దొంగతనాలు నివారించడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను తెలుసుకోవడం కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ లను ఆయా పోలీ స్టేషన్ల పరిధిలో బిగించారు. గతేడాది మీ ఇల్లు- మీ భద్రత పేరుతో పోలీసులు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, ముందస్తు జాగ్రత్తలే ఇప్పుడు సత్ఫలితాలినిస్తున్నాయి.పోలీస్ శాఖ, జీవీఎంసీ సంయుక్తంగా నగరంలో 2,250 కి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటుచేశాయి. స్టీల్ ప్లాంట్ రూ.84 లక్షలు, విశాఖ పోర్టు రూ.96 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహాయం అందించాయి. వాటితో పాటు ప్రైవేట్ సీసీ కెమెరాలు సుమారుగా 21,000 వరకు ఉన్నాయి. సిటీ పరిధిలో ప్రధానంగా 1,217 అపార్ట్ మెంట్ లకు గానూ 687 సీసీ కెమెరాలు, 824 రెస్టారెంట్ లకు గానూ 623 సీసీ కెమెరాలు, 402 లాడ్జిలుండగా 402 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాయి. వాటితో పాటు విద్యాసంస్థలు, దుకాణాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, ఇతర ప్రైవేట్ సంస్థల్లో సుమారు 17వేల వరకు సీసీ కెమేరాలు ఉన్నాయి. ఈ సీసీ కెమెరాల్లో కనీసం 15 రోజుల రికార్డింగ్ సామర్థ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది యంత్రాంగం.దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీలకు అప్పట్లో కేంద్రం రూ.200 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులు వెచ్చించి 520 సీసీ కెమెరాలను జీవీఎంసీ ఏర్పాటుచేసింది. అలాగే ఏపీ క్లౌడ్ బెస్ట్ సీసీ టీవీ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ కింద పోలీస్ శాఖ 1,648 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఇందులో కొన్ని ఆటోమేటిక్ నంబర్ రికగ్నైజేషన్ సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటిని హైవే, నగర ప్రధాన కూడలిలో ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు వాహనాల నంబర్ ప్లేట్లను జూమ్ చేసి, స్కాన్ చేస్తాయి. కూడలికి ముందు ప్రమాదాలు గానీ, నేరాలు గానీ జరిగితే అక్కడ నుంచి ఏ ఏ. వాహనాలు వెళ్లాయో తెలుసుకోవడానికి వీటి సహాయం తీసుకుంటారు. అంతే కాకుండా పోలీసు శాఖలో టెక్నికల్ టీం వారితో సీసీ టీవీల కోర్ టీమ్ ను ఏర్పాటు చేసారు. వీటి ద్వారా నగరంలో నేరాల కట్టడికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

Related Posts