కడప, ఏప్రిల్ 9,
మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐకు... వైయస్ జగన్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో సీబీఐ అధికారులు.. తన శాఖలోని ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో వారు.. ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. వైయస్ వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దర్యాప్తు కూడా చేపట్టి దాదాపు రెండేళ్లు కావోస్తోంది. అయితే ఈ హత్య కేసు దర్యాప్తు కోసం.. కడప వచ్చిన సీబీఐ అధికారులంతా.. స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఉంటున్నారు. అయితే ఈ గెస్ట్ హౌస్‌ను వెంటనే ఖాళీ చేయాలంటూ వారిని జగన్ ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 10వ తేదీ శ్రీరామనవమి. ఈ నేపథ్యంలో ఒంటిమిట్టలోని శ్రీరాముని ఆలయానికి సీఎం జగన్.. వచ్చి.. సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. దీనిని కారణంగా చూపుతూ.. సీబీఐ అధికారులను వెంటనే .. సదరు గెస్ట్ హౌస్ ఖాళీ చేయాలంటూ ఆదేశాలు రావడం కడప జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ఈ హత్య కేసు దర్యాప్తును మరింత ఆలస్యం చేసి.. ఈ కేసులోని దోషులను తప్పించే క్రమంలో ఈ ప్రభుత్వం ఆడుతున్న జగన్నాటకమనే ఓ టాక్ అయితే సోషల్ మీడియా సాక్షిగా తెగ వైరల్ అవుతోంది. మరోవైపు ఈ హత్య కేసు దర్యాప్తు ఏన్నాళ్లు చేస్తారంటూ.. వైయస్ వివేకా అభిమానులు సీబీఐపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2019, మార్చి 15న వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఆయనది తొలుత గుండెపోటు అని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పడమే కాదు.. నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌కు చెందిన మీడియాలో కూడా ఇదే వార్తలు.. వరుసగా కొన్ని గంటల పాటు ప్రసారమైందీ. మరో వైపు.. ఈ హత్య టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వం చేయించిందంటూ నాడు వైయస్ జగన్.. మీడియా సాక్షిగా ప్రకటించి.. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని.. నాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో వైయస్ జగన్ .. పార్టీ ఘన విజయం సాధించడం.. జగన్ ముఖ్యమంత్రి కావడం అంతా చకచకా జరిగిపోయింది. అయితే జగన్ ప్రభుత్వంలో .. తన తండ్రి హత్య కేసులో దోషులు ఎవరో తెలుస్తోందని వైయస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె వైయస్ సునీత వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. కానీ ఈ హత్య కేసు దర్యాప్తుపై వైయస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. వైయస్ సునీత ఢిల్లీ వెళ్లి... కేంద్రంలోని పెద్దలను సైతం కలిసి.. జరిగిన విషయాన్ని వారికి వివరించడమే కాకుండా.. సౌభాగ్యమ్మ, సునీతలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనితో వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగి.. తనదైన శైలిలో దర్యాప్తు చేపట్టడం.. ఆ క్రమంలో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి.. వివేకా హత్య వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులతోపాటు ఈ హత్యకు సుపారీ కింద కోట్లాది రూపాయిలు చేతులు మారినట్లు అతడు సీబీఐ అధికారులకు కళ్లకు కట్టినట్లు వివరించారు. ఆ తర్వాత ఉహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఈ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే కాదు.. వివేక కుమార్తె, అల్లుడుపైన కూడా.. ఎదురు కేసులు పెట్టేందుకు కొంత మంది వ్యక్తులు రంగంలోకి దిగడం.. ఆ క్రమంలో అసలు ఈ కేసులో ఏం జరుగుతుందో.. ఎవరికీ అర్థం కాని పరిస్థతి నెలకొంది. దీంతో సీబీఐ ఉన్నతాధికారులు.. తమ శాఖ ఉన్నతాధికారులతో.. ఈ కేసు దర్యప్తులో భాగంగా వరుసగా చోటు చేసుకోంటున్న పరిణామాలను వివరించడం.. ఆ తర్వాత వారికి ఈ కేసు విచారణలో కీలక ఆదేశాలు జారీ కావడం.. ఆ క్రమంలో మళ్లీ వారు రంగంలోకి దిగి.. తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందులోభాగంగా వివేకా హత్య కేసులో ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలకు కూడా నోటిసులు ఇచ్చేందుకు సీబీఐ అధికారులు వెళ్లగా.. వాటిని తీసుకునేందుకు వారు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసు మరికొద్ది రోజుల్లో తుది దశకు చేరుకోనుందని ఓ చర్చ అయితే తెలుగు ప్రజల్లో బలంగా ఉంది. కానీ తాజాగా సీఎం వైయస్ జగన్.. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాని కలిసి వచ్చి.. రావడంతోనే.. కడపలో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఆర్ అండ్ బీ గెస్ట్ హోస్ ఖాళీ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడం ఏమిటనే ఓ చర్చ అయితే .. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పోలిటికల్ సర్కిల్‌లో కూడా పలు సందేహాలకు తావిస్తోంది