తనపై, తన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతూ కొంత మంది నీచంగా వ్యవహరిస్తున్నారని క్యాస్టింగ్ కౌచ్ సంచలనం ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. ‘శ్రీరెడ్డి ఎయిడ్స్ ఎయిడ్స్‌తో చనిపోయిదంటూ కొంత మంది వ్యక్తులు యూట్యూబ్‌లో ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేశారు. నా ఫొటోలను అసభ్యకర రీతిలో పోస్టు చేస్తున్నారు’ అని ఆమె పేర్కొంది. తనపై పోస్టులు చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ తదనంతర పరిణామాల నేపథ్యంలో వార్తల్లో ప్రముఖంగా నిలిచిన శ్రీరెడ్డిపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విమర్శల పర్వం కొనసాగుతోంది. శ్రీరెడ్డి చనిపోయిదంటూ కొంత మంది పోస్టులు పెడుతున్నారు. ఆమె ఎయిడ్స్‌తో చనిపోయిందని కొందరు, ఆత్మహత్య చేసుకుందని మరికొందరు పోస్టింగ్‌లు చేస్తున్నారు. తనపై కక్ష సాధించేందుకు కావాలనే కొంత మంది ఇలా చేస్తున్నారని శ్రీరెడ్డి మండిపడింది. ఒక్కొక్కడి తాట వలుస్తా జాగ్రత్త. సైబర్ క్రైమ్‌లో కేసులు ఫైల్ చేశా. ఆడపిల్లలంటే మీ ఇష్టారాజ్యానికి ఏమైనా తిట్టొచ్చు అనుకునేవారికి చెల్లు చీటి. ఇప్పటికి 41 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇకపై పెద్ద తలకాయల పని చెప్తా..’ అంటూ శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ అకౌంట్లో రాసుకొచ్చింది.