YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సోమేష్ కు పదవీ గండం

 సోమేష్ కు పదవీ గండం

హైదరాబాద్, ఏప్రిల్ 9,
సుబ్బి పెళ్లి వెంకి చావుకు వచ్చింది అంటే ఇదే నేమో. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర ప్రభుత్వం పై రాజకీయ యుద్ధం ప్రకటించారు. వరితో మొదలైన వివాదం మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన అక్కడ ఏమి చేస్తున్నారో,ఎవరికీ తెలియడం లేదు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళక ముందు, ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో  సమావేశమవుతారని , వార్తలొచ్చాయి. అయితే, ఈనాలుగు రోజులలో చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే, అలాంటి అవకాశం లేదనే అనిపిస్తోందని అంటున్నారు. ఒక విధంగా చూస్తే పద్మవ్యూహంలో చిక్కుకుపోయిన అభిమన్యుడిలా కేసీఆర్ వరివ్యూహంలో చిక్కుకు పోయారని, ఇప్పుడు ఎంతోకొంత గౌరవప్రదంగా బయట పడే మార్గం కోసం చూస్తున్నారని అంటున్నారు. అదలా ఉంటే, కేసీఆర్’కు చెక్ చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం, బెంగాల్  ఫార్ములాను సిద్ధం చేస్తోంది. ఢిల్లీ నుంచి  అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉన్న వజ్రాయుద్ధాన్ని సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. గవర్నర్ తమిళి సై  ప్రోటోకాల్ వివాదం ఢిల్లీ చేరిన నేపధ్యంలో, కేంద్ర ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై, ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని, అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అలపన్ బంద్యోపధ్యాయ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్ల గీత దటి విధేయతను ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు. చివరకు ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటన సమయంలోనూ, మమతా బెనర్జీ ఆడించిన రాజకీయ క్రీడలో పావుగా మారి సమస్యలు కొని తెచ్చుకున్నారు. ఆయన రిటైర్మెంట్’కు రెండు రోజుల ముందు, కేంద్ర ప్రభుత్వ, డిపార్టుమెంటు అఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ – డీఓపీటీ, ఇచ్చిన  ఎక్స్టెన్షన్ రద్దు చేసి రీకాల్ చేసింది. అయితే మమతా బెనర్జీ ఆయన్ని మూడేళ్ళ కాలానికి రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా నియమించారు. కానీ, ఇప్పటికీ కూడ ఆయన సర్వీస్ నిబంధనలకు సంబదించిన చిక్కుల నుంచి పూర్తిగా బయట పడలేదు. సోమేశ్ కుమార్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అదే విధంగ వ్యవహరిస్తుందా,  రీకాల్ చేస్తుందా అనే చర్చ అధికర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం గవర్నర్’ను ఢిల్లీ పిలిపించిన సందర్భంలో గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను గమనిస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రొటోకాల్  ఉల్లంఘనలను చాలా సీరియస్ తీసుకుందని, ముఖ్యంగా ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవహర సరళి పై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుగ ఆయన మెదడ వేతు వేస్తుందని అధికార వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి. నిజానికి సోమేశ్ కుమార్, ఆంధ్రా క్యాడర్ అదికారి, కాబట్టి ఆయన్ని వెనక్కి పిలిపిలిపించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ముందస్తు అనుమతి కూడా అవసరం ఉండక పోవచ్చని అధికారులు అంటున్నారు. మరో వంక టాలీ వుడ్ డ్రగ్స్ కేసు సహా అనేక ఇతర్ కేసుల్లో చీఫ్ సెక్రెటరీ హోదాలో ఆయన, కోర్టు దిక్కరణ ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. సో .. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం పై ప్రకటించిన రాజకీయ యుద్ధం చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై వేటుతో, మరో దశకు చేరుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నారు

Related Posts