న్యూఢిల్లీ
జగన్ ముఖ్యమంత్రిగా ఉండటమే ఏపీ దౌర్భాగ్యమని.. తెదేపా రాజ్యసభ సభ్యులు శ్రీ కనకమేడల రవీంద్రకుమార్ మండిపడ్డారు. - ‘చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండడం దౌర్భాగ్యమని వైకాపా ఎంపీలు అంటున్నారు. నిజమే జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడమే రాష్ట్రానికి మంచిది’ అని ఆయన పేర్కొన్నారు. - రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ నివేదికనే తాము చెబుతున్నామని, అది తప్పయితే దానిపై వైకాపా ఎంపీలు పార్లమెంటులో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు ముఖ్యమంత్రి ఏం అడిగారని తాము ప్రశ్నిస్తే.. వైకాపా ఎంపీలు తమను, తమ పార్టీ అధినేత చంద్రబాబును దూషించడమేమిటని ప్రశ్నించారు. కాగ్ అవాస్తవాలు చెప్పిందని వైకాపా ఎంపీలు నిరూపించాలని సవాలు విసిరారు. ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రితో ముఖ్యమంత్రి ఫలానా అంశాలు మాట్లాడారంటూ గతంలో ఇచ్చిన ప్రెస్‌నోట్ లోనే మళ్లీ విడుదల చేశారని ఎద్దేవా చేశారు.