న్యూ డిల్లీ ఏప్రిల్ 9
రెండు నెలలుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం ఇంకా పూర్తిగా చల్లరినట్లు కనిపించడం లేదు. శాంతి చర్చలు సఫలం అయ్యాయని వార్తలు వచ్చినా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా వరుసగా బాంబుల వర్షం కురిపించడంతో ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. మరోవైపు ఇప్పటికే దేశంలోని చాలా మంది పౌరులు వలస వెళ్లారు. విదేశీయులు సొంత ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే ఇటీవల జరిగిన చర్చలు సఫలమయ్యాయని రష్యా సైన్యం వెనక్కి వెళుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. కానీ ఇటీవల ఉక్రెయిన్లోని రైల్వేస్టేషన్ పై రష్యా దాడి చేసిందని రష్యా ఆరోపిస్తోంది. అయితే ఈ దాడితో తమకు సంబంధం లేదని ఈ యుద్ధం వల్ల తాము కూడా నష్టపోయాని రష్యా ప్రభుత్వం చెబుతోంది. తమ సైనికుల మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్టున్నట్లు పేర్కంది.తమ పొరుగుదేశంగా ఉన్న ఉక్రెయిన్ నాటోలో చేరొద్దని అందుకు అంగీకారం తెలపాలన రష్యా కోరింది. అయితే అందుకు ఉక్రెయిన్ ఒప్పుకోకపోవడంతో రష్యా ఫిబ్రవరి 24న యుద్ధంలోకి దిగింది. అప్పటి నుంచి ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలను టార్గెట్ చేసుకొని బాంబుల వర్షం కురిపిస్తోంది. ముందుగా ఆ దేశ రాజధాని అయిన కీవ్ ను ఆక్రమించుకొని ప్రధాన కేంద్రాలను ధ్వంసం చేసింది. అలాగే అతిపెద్ద కార్గో విమానాన్ని పేల్చేసింది. ఇక ఈ దాడిలో ఉక్రెయిన్ సైనికులతో పాటు సాధారణ పౌరులూ మరణించారు.రెండు మూడురోజుల పాటు యుద్ధం చేయడంతో ఉక్రెయిన్ తమ దారికి వస్తుందని రష్యా భావించింది. అయితే ఉక్రెయిన్ మాత్రం ఎంత నష్టం జరుగుతున్నారు రష్యాకు ఎదురొడ్డి పోరాడింది. సాధారణ పౌరులు సైతం యుద్ధంలోకి రావాలని పిలుపునివ్వడంతో ప్రతిఒక్కూ గన్ లను చేతబట్టుకనొ రష్యా సైనికులను తరిమికొట్టారు. అయితే రష్యా భీకర దాడులతో భవనాలు ప్రధాన కేంద్రాలపై దాడులు చేసింది. దీంతో ఉక్రెయిన్ అల్లకల్లోలమైంది.అయితే ఉక్రెయిన్ పౌరులు ఎదురొడ్డి నిలబడడంతో పాటు రష్యా మిస్సౌల్స్ హెలీ క్యాప్టర్లను పేల్చివేయడంతో భారీగా నష్టపోయింది. మరోవైపు ఉక్రెయిన్ దేశంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న రష్యా సైన్యంపై ప్రతిగా దాడులు చేయడం ప్రారంభించింది. రష్యా సైనికులే లక్స్యంగా ఉక్రెయిన్ పోరాటం చేసింది. దీంతో చాలా మంది రష్యా సైనికులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. తమ దాడిలో మొత్తంగా 18వేల మంది సైనికులను కోల్పోయిందని ఉక్రెయిన్ చెబుతోంది. అయితే పుతిన్ ప్రభుత్వం ఉక్రెయిన్ చెప్పిన సంఖ్య కంటే తక్కువగానే తెలిపింది.ఇక తాగాజా రష్యా అధికార ప్రతినిధి మాట్లాడుతూ తమ సైనికుల మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో తమ సైనికులను కోల్పోయినందుకు రష్యా అల్లాడిపోతున్నట్లు అర్థమవుతోంది. మరోవైపు శాంతి చర్చల తరువాత దాడులు ఆపేశామని రష్యా చెబుతుండగా.. తాజాగా ఉక్రెయిన్లోని రైల్వేస్టేషన్ పై దాడి జరిగిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.తమకు ఎదురుగా పోరాటం చేసే ధైర్యం లేక ఇలా సాధారణ పౌరులపై విరుచుకుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తో పాటు రష్యా కూడా భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది.