YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సరుకు రవాణలో విశాఖ పోర్టుకు నాలుగవ స్థానం

సరుకు రవాణలో విశాఖ పోర్టుకు నాలుగవ స్థానం

విశాఖపట్నం
దేశంలోని మేజర్‌ పోర్టుల సరుకు రవాణాలో 2021,22 ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు 69 మిలియన్‌ టన్నుల వ్యాపారం చేసి నాలుగో స్థానంలో నిలిచిందని పోర్టు చైర్మన్‌ కె.రామ్మోహనరావు తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మూడో స్థానం దక్కించుకునేలా 71 మిలియన్‌ టన్నుల లక్ష్యంగా పని చేస్తామని వెల్లడించారు. నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ స్కీమ్‌లో భాగంగా పోర్టుల ఆస్తులేవీ అమ్మడం లేదని, 30 ఏళ్ల పాటు లీజుకు ఎవరొచ్చినా ఇస్తామని తెలిపారు. పోర్టు 69.03 మిలియన్‌ టన్నుల సరుకు రవాణాలో స్టీమ్‌ కోల్‌ ఎగుమతుల్లో 38 శాతం, థర్మల్‌ కోల్‌లో వంద శాతం వృద్ధి కనిపించిందన్నారు. ఆయిల్‌ రవాణాలో 11 శాతం, ఐరన్‌ ఓర్‌లో 23 శాతం మేర పోర్టు కార్గో తగ్గిందని తెలిపారు. విశాఖ పోర్టుకు ఈ ఆర్థిక సంవత్సరంలో న్యూ కార్గోకు సంబంధించి ఆయిల్‌, ఫుడ్‌ గ్రెయిన్స్‌, బాక్సైట్‌ ఎగుమతులు రాబోతున్నాయని, అన్‌రాక్‌ కంపెనీ, ఎన్‌ఎండిసితో తాజాగా అగ్రిమెంట్లు జరిగాయని చెప్పారు. నాగర్‌నార్‌లో ఎన్‌ఎండిసి స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి కోల్‌ను ఫ్యాక్టరీ వరకూ ఇచ్చే అగ్రిమెంట్‌ కుదిరిందని తెలిపారు. విశాఖ పోర్టులో 7, 8 బెర్తులను రూ.280 కోట్లతో పిపిపిలో ఇస్తున్నామని పేర్కొన్నారు.

Related Posts