YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్ దొంగ ధర్నాలు

వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్ దొంగ ధర్నాలు

ఖమ్మం
 పాలు తాగిన పిల్లిలా కేసీఆర్ నటన వుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల 50వ రోజు పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం పడమటి తండా వద్ద పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం జన్ బాద్ తండా, సీతారాంపురం క్రాస్, రైల్వే కాలనీ మీదుగా సాగింది. ప్రజాప్రస్థానం 50వ రోజుకు చేరిన సందర్భంగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉదయం 11.30గంటలకు పాపట్ పల్లి గ్రామంలో వడ్ల కొనుగోళ్లపై ధర్నా నిర్వహించారు. రైతులతో కలిసి నిరసన తెలిపారు.
షర్మిల మాట్లాడుతూ - కేంద్రం వడ్లు కొనకపోవడానికి కారణం కేసీఆర్.  బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఎందుకు సంతకం చేశారు? - కేసీఆర్ సంతకం రైతులకు మరణశాసనమైంది.  మిల్లర్లతో కేసీఆర్ కుమ్మక్కుఅయ్యారు.  తక్కువ ధరకే వడ్లు కొనేలా ప్లాన్ వేసారు.  రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
 తప్పు కేసీఆర్ ది.. శిక్ష రైతులకా?  మద్దతు ధరతో వడ్లన్నీ కేసీఆరే కొనాలె  ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేసారు. రైతులు దోపిడీకి గురికావడానికి కారణం కేసీఆర్. కేసీఆర్ తప్పిదం వల్ల రైతులు ఎందుకు శిక్ష అనుభవించాలి? కేసీఆర్ ఒక్క సంతకంతో రైతులను బావిలో తోసి ఏమీ తెలియనట్టు రక్షించండి రక్షించండి అని కేంద్రాన్ని అడుక్కుంటున్నారు. అసలు సంతకం ఎవరు పెట్టుమన్నారు? ధర్నాల పేరుతో ఈ డ్రామాలు ఎవరు ఆడమంటున్నారు? కేసీఆర్  ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి నేను సంతకం పెట్టడం తప్పే అని తప్పు ఒప్పుకొని , కొనుగోలు కేంద్రాలు తెరిచి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

Related Posts