హైదరాబాద్ ఏప్రిల్ 9
తెలంగాణ కాంగ్రెస్‌లో వివాదాలు ఇప్పట్లో సద్దుమనుగేలా లేవు. అంతా కలిసిపోవాలని అధినాయక్వం సూచించినప్పటికీ ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దామోదర్ రెడ్డిపై పార్టీ అధిష్టానానికి తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో తుంగతుర్తిలో పార్టీకి నష్టం కలిగించిన డాక్టర్ రవిని ప్రోత్సహిస్తున్నారని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఫిర్యాదు చేశారు.2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయవద్దని రవికి రాహుల్ గాంధీ చెప్పినప్పటికీ పోటీ చేశారని, పార్టీ ఓటమికి కారణమయ్యాడని, దీంతో ఆయనపై పార్టీ నాయకత్వం ఆయనపై ఆరేండ్ల పాటు సస్పెండ్ చేసిందన్నారు. అలాంటి వ్యక్తిని మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.