విజయవాడ
మహాత్మ జ్యోతి బా పూలే జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. మున్సిపల్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. మంత్రిగా ప్రమాణం చేయబోతున్న పెడన ఎమ్మెల్యే జోగి రమేష్. బీసీ సంఘాల చైర్మన్లు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ బీసీ వర్గానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అభినవ జ్యోతిబాపూలే విధి విధానాలను ఆచరణ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ క్యాబినెట్ మంత్రి వర్గాన్ని చూస్తేనే బిసి వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. మంత్రి పదవులు రాని వారు నిరాశ పడాల్సిన అవసరం లేదని పార్టీ కోసం అందరూ కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని, కావలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడమే చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయని, అధిగమించి అందరూ కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందని, మేము అందరం ఒకే కుటుంబం అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళులాంటి వాళ్ళని ఎవరికీ విభేదాలు లేవని అన్నారు.