YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో కరెంట్ కష్టాలు

తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో కరెంట్ కష్టాలు

తిరుపతి
తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో విద్యుత్ నిలిచిపోయి పేషెంట్లు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి విద్యుత్ రాకపోవడంతో పేషెంట్ల బంధవులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
తిరుపతిలోని మెటర్నిటీ ఆసుపత్రిలో విద్యుత్ నిలిచిపోయింది. గంటల తరబడి విద్యుత్ కోతలతో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఎమర్జెన్సీ పేషెంట్లను పక్క వార్డ్ కి మారుస్తు న్నారు ఆస్పత్రి సిబ్బంది. విద్యుత్ లేకపోవడంతో పేషెంట్ల సహాయకులు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రి లోపల ఏమి జరుగుతుందో తెలియక బయట పేషెంట్ల బందువులు ఆందోళ న చెందుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పేషెంట్ల ప్రాణాలు కాపాడాలంటూ వారి బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Related Posts