YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సినిమాలు, జబర్దస్త్ కు దూరం: రోజా సంచలన ప్రకటన

సినిమాలు, జబర్దస్త్ కు దూరం: రోజా సంచలన ప్రకటన

విజయవాడ
సినిమాలు కానీ, రాజకీయాలు కానీ రెండు రంగాల్లో రోజా తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపును పొందారు. సినిమా హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల పాటు అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఆమె వెలుగొందారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత వైసీపీలోకి మారిన తర్వాత కానీ ప్రత్యర్థులపై ఆమె విరుచుకు పడిన తీరు ఒక రేంజ్ లో ఉంటుంది. వైసీపీ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన రోజా... పార్టీ కోసం అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉన్నారు. ఆమె అంకితభావాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్... ఆమెను మంత్రి పదవికి ఎంపిక చేశారు. కాసేపట్లో ఆమె రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి లభించినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై తన అభిమానం రెట్టింపయిందని చెప్పారు. ముఖ్యమంత్రి తనకు ఏ శాఖను కేటాయించినా సమర్థవంతంగా పని చేస్తానని తెలిపారు. ఇదే సమయంలో ఆమె సంచలన ప్రకటన చేశారు. సినిమాలకు, జబర్దస్త్ షోకు గుడ్ బై  చెపుతున్నట్టు ప్రకటించారు. మంత్రిగా తన పూర్తి సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుందని... ఈ సమయంలో సినిమాలు, షోలకు సమయం కేటాయించలేనని ఆమె తెలిపారు. మంత్రిగా సీఎంకు మంచి పేరు తీసుకొచ్చేలా బాధ్యతలను నిర్వర్తిస్తానని చెప్పారు.

Related Posts