YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉద్యోగులతో సీఎం కేసీఆర్‌ భేటీ

ఉద్యోగులతో సీఎం  కేసీఆర్‌ భేటీ

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై ఇటీవలే ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సారథ్యంలోని మంత్రుల కమిటీ సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేసింది ఈ క్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై సీఎం కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇక అన్ని అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.ఆర్టీసీ ఉద్యోగులు జీతాలు పెంచాలని కోరడం ఏ మాత్రం సమంజసం కాదని సీఎం కేసీఆర్‌ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లపై జరగబోయే సమావేశంపై సీఎం కేసీఆర్‌ అధికారులతో, కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులతో చర్చించారు. ఆర్టీసీ ఇప్పటికే రూ.2,800 కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోగా... మళ్లీ జీతాలు పెంచితే ఏడాదికి రూ.1400 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని సీఎం అభిప్రాయంగా ఉందా. ఇలాంటి తరుణంలో జీతాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచాలని డిమాండ్‌ చేయటం అసంబద్ధమని చెప్పారు. నిరంతరం నష్టాల్లో కూరుకుపోతున్న ఆర్టీసీని ప్రభుత్వం నడపాలా? వద్దా? అని ఉద్యోగులు ప్రశ్నించుకోవాలని సూచించారు. .

Related Posts