YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మహాత్మా జ్యోతిభాపూలే జయంతి సందర్భంగా ఢిల్లీలో నివాళులు

మహాత్మా జ్యోతిభాపూలే జయంతి సందర్భంగా ఢిల్లీలో నివాళులు

న్యూఢిల్లీ
వెనుకబడిన, అణగారిన వర్గాల కోసం క్రుషి చేసిన మహాత్మా జ్యోతిభాపూలే జయంతి సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ భవన్లోని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బహుజనుల, వెనుకబడిన వర్గాల కోసం మహాత్మా జ్యోతిబాపూలే చేసిన సేవల్ని స్మరించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పూలే జయంతి వేడుకల్ని అధికారికంగా నిర్వహించడంతో పాటు పూలే పేరున బీసీ గురుకులాలు, విదేశీ విధ్యానిది పథకాల్ని అమలు చేస్తున్నామన్నారు.
అనంతరం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతుల యాసంగి వడ్లను కొనాలని ఢిల్లీలో చేస్తున్న మహాదీక్ష ప్రాంగణానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేరుకున్నారు. ఆయనతో పాటు కరీంనగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్ రాజ్యాంగ బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవద్దని రైతులు పండించిన పంటను వ్యాపార కోణంలో కాకుండా సామాజిక బాధ్యతతో చూడాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు రైతుల కోసం ఎన్నో పథకాలు తెచ్చరని రైతుబందు, రైతుబీమా, 24 గంటల ఉచితకరెంట్, సాగునీరు అందించి రైతుల బాగుకోసం క్రుషిచేస్తున్నారని ఇలాంటి సమయంలో రైతుల పంటలను సేకరించకుండా కేంద్రం తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దని, దేశమంతా ఒకే పంట సేకరణా విధానం ఉండాలన్నారు.
 రైతులపై కేంద్ర బీజేపీ ప్రభుత్వ కక్షపూరిత వైఖరి విడనాడాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాదీక్ష దేశ చరిత్రలోనే విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర రైతాంగం కోసం స్వయంగా ముఖ్యమంత్రి దేశ రాజదానిలో దీక్ష చేపట్టడం, ఈ దీక్షకు జాతీయ రైతు సంఘాలు, రాకేష్ టికాయత్ లాంటి నేతలు సంఘీభావం ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని పున:సమీక్షించి తెలంగాణ రైతులు పండించిన పంట సేకరణకు ఆదేశాలివ్వాల్సి ఉంది.
ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు మేయర్ సునీల్ రావు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ రుద్రరాజు, నాయకులు చల్లా హరిశంకర్, కర్రా శేఖర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts