విజయవాడ
సోమవారం నాడు పదవీ స్వీకారం చేసిన మంత్రులు ముత్యాల నాయుడు, కారు మూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ ఛీఫ్ విప్ గండికోట శ్రీ కాంత్ రెడ్డి అంతకుముందు ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. రి దర్శనానంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.
మంత్రి ముత్యాల నాయుడు మాట్లాడుతూ క్యాబినెట్ లో స్థానం కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి కి రుణ పడి ఉంటాను. గత టీడీపీ హయాంలో పచ్చ చొక్కా వేసుకున్న వారికే సంక్షేమ ఫలాలు అందేవి. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలు అందరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. జన్మభూమి కమిటీ ల పేరుతో దోచుకున్న చరిత్ర టీడీపీ ది. పేదల గడపలకు సంక్షేమన్ని చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ది. 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తానని అన్నారు.
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ క్యాబినెట్ లో స్థానం కల్పించిన సీఎం కు రుణపడి ఉంటాను. మంత్రిగా ఏశాఖ ఇచ్చినా చిత్తశుద్ధి తో పనిచేస్తానని అన్నారు.