అమరావతి
వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఏపీ కేబినెట్లో నూతన మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. గతంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్గా పనిచేశారు. 2009లో రాజకీయ అరంగేట్రం చేశారు. 2019లో వేమూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
సాలూరు ఎమ్మెల్యే పి. రాజన్నదొర ఏపీ నూతన కేబినెట్లో నూతన మంత్రిగా ప్రమాణం చేశారు. 2009 నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019లో సాలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012-13 మధ్య ఎస్టీ కమిషన్ ఛైర్మన్గా పనిచేశారు.
నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ నూతన కేబినెట్లో నూతన మంత్రిగా ప్రమాణం చేశారు. 2014, 2019లో నగరి నుంచి గెలుపొందింది. 2020 నుంచి ఏపిఐఐసీ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో రాజకీయ అరంగేట్రం చేశారు.
పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ఏపీ నూతన కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. 2007 నుంచి పలాస ప్రాంతంలో వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. 2019లో పలాస నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే తానేటి వనిత ఏపీ నూతన కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. 2009లో మొదటిసారి గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నుంచి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.