YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేంద్రానికి కేసీఆర్ డెడ్ లైన్

కేంద్రానికి  కేసీఆర్ డెడ్ లైన్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11,
వరి కొనుగోళ్ల విషయంలో ఢిల్లీపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇవాళ హస్తినలో నిరసన దీక్షకు దిగారు.. ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ఆయన.. కేంద్ర సర్కార్‌కు 24 గంటల డెడ్‌లైన్‌ పెట్టారు.. తెలంగాణ రైతులు చేసిన పాపం ఏంటి..? అని ఫైర్‌ అయిన ఆయన.. రైతులను కన్నీరు పెట్టిస్తే, గద్దె దించే సత్తా రైతులకు ఉందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వంపై ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు(CM KCR). ఎవరితోనైనా పెట్టుకోండి.. రైతులతో కాదంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు సీఎం కేసీఆర్. ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులను జైలుకు పంపుతామని బెదిరిస్తారని.. దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర ధాన్యం కొనుగోళ్ల విషయంలో వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇందుకు 24 గంటల సమయం ఇస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం తాము ఎలాంటి చర్యలు తీసుకుంటామో వేచి చూడాలని, భూకంపం సృష్టిస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ పార్టీకి చెందిన నేతలు ఏమి చేశారో కుండబద్ధలు కొడుతామని హెచ్చరించారు.
ప్రశ్నించిన వారిపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తోందని.. ఇలా చేయడం పద్ధతి కాదని.. తాము ఇప్పటికే పోరాటం చేసేందుకు ముందుకు వచ్చామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ముందుకు వచ్చిన తర్వాత.. వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. 2022, ఏప్రిల్ 11వ తేదీ సోమవారం తెలంగాణ భవన్ ప్రాంగంణంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టనుంది. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఈ దీక్ష జరిగింది. భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ విషయంలోనే ఎందుకిలా ప్రవర్తిస్తున్నారంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పీయూష్ గోయల్ కాదు.. పీయూష్ గోల్మాల్ అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ రైతులను ఉద్దేశించి కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమైనవని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలని పీయూష్‌ గోయల్ చెప్పారని.. అసలు తాము గోయల్ వద్ద అడుక్కోవడానికి వచ్చామా అంటూ మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనాలని దేశ రాజధాని ఢిల్లీలో దీక్ష చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. దీక్షకు మద్దతిచ్చేందుకు వచ్చిన తికాయత్‌కు ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్‌.. తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ దూరం వచ్చి దీక్ష చేస్తున్నామని వెల్లడించారు. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు అంటూ నిలదీశారు. ఎవరితోనైనా గొడవ పడొచ్చు కానీ.. రైతులతో పడవద్దన్న సీఎం కేసీఆర్‌.. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా హితవు పలికారు. దేశవ్యాప్తంగా ఎక్కడా లేనంతగా 30 లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయని కేసీఆర్‌ అన్నారు.
సీఎం కేసీఆర్ చేస్తున్నది రైతు ఉద్యమం..
కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో సీఎం కేసీఆర్ చేస్తోంది రాజకీయం కాదు.. రైతు ఉద్యమం అని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (BKU) నేత రాకేశ్ టికాయత్ అన్నారు. రైతుల పక్షాన పోరాడుతున్న సీఎం కేసీఆర్ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణకు కూడా వచ్చి పోరాటం చేస్తామని అన్నారు. దేశంలో రైతులు మరణిస్తూనే ఉన్నా కేంద్రం పటిష్ఠ చర్యలు తీసుకోకుండా కళ్లప్పగించి చూస్తోందని ఆరోపించారు. రైతుల ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఎవరికి అధికారం శాశ్వతం కాదు.. కేంద్రానికి అహంకారం ఎందుకు? అని నిలదీశారు.. ధాన్యం కోనుగోళ్లపై కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ పెట్టిన కేసీఆర్.. కేంద్రం వరి కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోకపోతే.. మేమే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్.. పీయూస్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్న ఆయన.. నూకలు తీనమన్నాడు.. ఆయన పీయూష్ గోయల్‌ కాదు.. పీయూష్ గోల్‌మాల్‌ అని మండిపడ్డారు.. గోయల్‌ ఉల్టా ఫల్టా మాట్లాడుతున్నారు.. పీయూష్ గోయల్‌కు ఏమైనా అవగాహన ఉందా? మాకు ధర్నా చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది అని నిలదీశారు.. దేశంలోని రైతులు భిక్షగాళ్లు కాదు.. ఒకే విధానం లేక‌పోతే రైతులు రోడ్లపైకి వ‌స్తార‌ని స్ప‌ష్టం చేశారు. ప్రధాని మోడీ, పీయూష్ గోయ‌ల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల‌ని కోరారు.. తెలంగాణ నుంచి సుమారు 2 వేల కిలోమీటర్ల దూరం వ‌చ్చి దీక్ష చేస్తున్నాం.. ఇంత దూరం వ‌చ్చి ఆందోళ‌న చేయ‌డానికి కార‌ణ‌మెవ‌రు? న‌రేంద్ర మోడీ ఎవ‌రితోనైనా పెట్టుకో.. కానీ, రైతుల వ‌ద్ద మాత్రం పెట్టుకోవద్దు అని హెచ్చరించారు.. మరోవైపు.. హైదరాబాద్‌లో బీజేపీ ఎందుకు ధర్నా చేస్తుంది? అని ప్రశ్నించారు కేసీఆర్.. బీజేపీ సిగ్గు లేకుండా వ్యవహరిస్తోందన్న ఆయన.. కేంద్రం ప్రతి గింజా కొంటుందని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ప్రచారం చేశారు… మరి, తెలంగాణ ధాన్యం కొనడానికి కేంద్రానికి డబ్బుల్లేవా, మనసు లేదా? అని నిలదీశారు

Related Posts