లాహోర్, ఏప్రిల్ 11,
దే చరిత్రలోనే అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం నుంచి వైదొలిగిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నిలిచారు. పదవిని కాపాడుకనేందుకు చివరి వరకు పోరాడిన ఆయనకు ఓటమి తప్పలేదు. దాంతో పాకిస్తాన్ 75 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా పూర్తికాలం పదవిలో లేని చరిత్రను ఇమ్రాన్ కొనసాగించినట్టయింది.పాకిస్తాన్ ఆవిర్భవించిన 1947 నుంచి నేటి వరకు మొత్తం 29 మంది ప్రధాని పీఠం ఎక్కారు. వారిలో ఒకరు ఒక సంవత్సరంలో రెండుసార్లు ఆ పదవిని చేపట్టారు. 18 సందర్భాలలోప్రధానమంత్రులు అవినీతి ఆరోపణలు, ప్రత్యక్ష సైనిక తిరుగుబాట్లు. ప్రభుత్వ అంతర్గత ముఠా తగాదాల కారణంగా బలవంతంగా రాజీనామాలు చేయటమో, తొలగించటమో జరిగింది.ఇప్పటి వరకు ఓ పాకిస్తాన్ ప్రధాన మంత్రి పదిలో కొనసాగిన అత్యల్ప కాలం రెండు వారాలు కాగా అత్యధికంగా నాలుగు సంవత్సరాల రెండు నెలలు. నవాజ్ షరీఫ్ 1990, 1997, 2013లో మొత్తం మూడు సార్లు ప్రధానమంత్రి పీఠం అధిష్టించారు. ఇది ఒక రికార్డు.1947 నుంచి ఇప్పటి వరకు ఏ ప్రధాని ఎంతకాలం పదవిలో ఉన్నారో చూస్తే..లియాఖత్ అలీ ఖాన్: పాకిస్తాన్ మొదటి ప్రధాన మంత్రి. ఆగస్ట్ 1947లో పదవీ బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్ 16, 1951న రాజకీయ ర్యాలీలో హత్యకు గురయ్యారు. పదవీకాలం: నాలుగు సంవత్సరాల రెండు నెలలు.
ఖ్వాజా నజీముద్దీన్: అక్టోబరు 17, 1951న పదవీ బాధ్యతలు స్వీకరించారు. మత ఘర్షణలను అదుపు చేయటంలో విఫలమయ్యాడనే అభియోగంతో దేశ గవర్నర్ జనరల్ అతన్ని ఏప్రిల్ 17, 1953న తొలగించారు. పదవీకాలం: ఒక సంవత్సరం ఆరు నెలలు.ముహమ్మద్ అలీ బోగ్రా: ఏప్రిల్ 17, 1953న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 11, 1955న రాజీనామా చేశారు. పదవీకాలం: రెండేళ్ల మూడు నెలలు.
చౌదరి మహ్మద్ అలీ: ఆగస్టు 1955లో పదవీ బాధ్యతలు చేపట్టారు. పాలక పక్షంలో అంతర్గత విభేదాలు సెప్టెంబర్ 12, 1956న ఆయనను తొలగింపునకు దారితీశాయి. పదవీకాలం: ఒక సంవత్సరం మరియు ఒక నెల.హుస్సేన్ షాహీద్ సుహ్రావర్ది: సెప్టెంబర్ 12, 1956న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్ 18, 1957న ఇతర పవర్ సెంటర్స్‌తో విభేదాల వల్ల బలవంతంగా పదవికి దూరమయ్యాడు. పదవీకాలం: ఒక సంవత్సరం మరియు ఒక నెల.
ఇబ్రహీం ఇస్మాయిల్ చుంద్రిగర్: అక్టోబర్ 1957లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 16, 1957న పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని రాజీనామా చేశారు. పదవీకాలం: రెండు నెలల కంటే తక్కువ.మాలిక్ ఫిరోజ్ ఖాన్ నూన్: డిసెంబర్ 16, 1957న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్ 7, 1958న పాకిస్తాన్‌లో మార్షల్ లా విధించిన కారణంగా పదవి పోగొట్టుకున్నాడు. పదవీకాలం: 10 నెలల కన్నా తక్కువ.
నూరుల్ అమీన్: డిసెంబరు 7, 1971న పదవీ బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయిన కొద్దికాలానికే డిసెంబర్ 20, 1971న పదవీచ్యుతడయ్యాడు. పదవీకాలం: రెండు వారాల కంటే తక్కువ.జుల్ఫికర్ అలీ భుట్టో: ఆగష్టు 14, 1973న పదవీ బాధ్యతలు స్వీకరించారు. జూలై 5, 1977న సైనిక తిరుగుబాటుతో పదవీచ్యుతుడు కావటమే గాక జైలు పాలయ్యాడు. తరువాత సైనిక ప్రభుత్వం ఆయనను ఉరితీసింది. పదవీకాలం: మూడు సంవత్సరాల 11 నెలలు.ముహమ్మద్ ఖాన్ జునేజో: మార్చి 1985లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రెసిడెంట్ కూడా అయిన మిలటరీ చీఫ్ అతనిని మే 29, 1988న తొలగించారు. పదవీకాలం: మూడు సంవత్సరాల రెండు నెలలు.
బెనజీర్ భుట్టో: జుల్ఫికర్ అలీ భుట్టో కుమార్తె ఈమె. డిసెంబరు 2, 1988న ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె ప్రభుత్వం అవినీతి ఆరోపణలపై ఆగస్టు 6, 1990న అధ్యక్షుడు ఆమెను తొలగించారు. పదవీకాలం: ఒక సంవత్సరం ఎనిమిది నెలలు. అధ్యక్షుడి విస్తృత అధికారాలను ఉపయోగించి ఇలాంటి ఆరోపణలపై కూలిపోయిన మూడు ప్రభుత్వాలలో ఇది మొదటిది.
మియా ముహమ్మద్ నవాజ్ షరీఫ్: నవంబర్ 6, 1990న పదవీ బాధ్యతలు స్వీకరించారు. భుట్టో మాదిరిగానే ఈయనను కూడా అవినీతి ఆరోపణలపై ఏప్రిల్ 18, 1993న అతని ప్రభుత్వాన్ని దేశాధ్యక్షుడు రద్దు చేశాడు. కొన్ని వారాల తర్వాత కోర్టు ద్వారా ఆ నిర్ణయాన్ని రద్దు చేసి తిరిగి పదవీ బాధ్యతలు స్వీకరించగలిగాడు. కానీ సైన్యంతో విభేదాల తర్వాత మళ్లీ రాజీనామా చేశారు. మొత్తం పదవీకాలం: రెండు సంవత్సరాల ఏడు నెలలు. బెనజీర్ భుట్టో: అక్టోబరు 19, 1993లో ఆమె రెండవ సారి ప్రధాని పీఠ అధిష్టించారు. నవంబర్ 5, 1996న దుష్పరిపాలన ఆరోపణలపై అధ్యక్షుడు ఆమెను పదవి నుంచి తొలగించారు. పదవీకాలం: మూడు సంవత్సరాలకు కొన్ని రోజులు ఎక్కువ.
నవాజ్ షరీఫ్: ఫిబ్రవరి 17, 1997న రెండవసారి అధికారంలోకి వచ్చారు. అక్టోబర్ 12, 1999న సైనిక తిరుగుబాటు ద్వారా పదవీచ్యుతుడయ్యారు. ఇలా జరగటం పాకిస్తాన్ చరిత్రలో ఇది మూడవసారి. పదవీకాలం: రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు.మీర్ జఫరుల్లా ఖాన్ జమాలీ: 2002, నవంబర్ లో సైనిక పాలనలో ప్రధాని అయ్యారు. జూన్ 26, 2004న సైన్యంతో విభేదాల తర్వాత ఆయన రాజీనామా చేశారు. పదవీకాలం: ఒక సంవత్సరం ఏడు నెలలు.
యూసఫ్ రజా గిలానీ: మార్చి 25, 2008న ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. “కోర్టు ధిక్కారం” ఆరోపణలపై 2012లో పాకిస్థాన్ సుప్రీం కోర్టు ఆయనను అనర్హులుగా ప్రకటించింది. పదవీకాలం: నాలుగు సంవత్సరాల ఒక నెల. నవాజ్ షరీఫ్: జూన్ 5, 2013న మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. జూలై 28, 2017న ఆస్తులను దాచారనే ఆరోపణలపై పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆయనను తొలగించింది. పదవీకాలం: నాలుగు సంవత్సరాల రెండు నెలలు.
ఇమ్రాన్ ఖాన్: ఆగస్టు 18, 2018న ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 10, 2022న ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం నుంచి వైదొలిగారు. పదవీకాలం: మూడేళ్ల ఏడు నెలలు. ముస్లింలీగ్-నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ (నవాజ్ షరీఫ్ సోదరుడు) తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన కూడా ఆ పదవిలో స్వల్ప కాలం మాత్రమే కొనసాగుతారు.