YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

నిబంధనలు బేఖాతరు

నిబంధనలు బేఖాతరు

ఇటీవలిగా ప్రజలు మినరల్ వాటర్‌నే తాగునీటి కోసం వినియోగిస్తున్నారు. దీంతో ఈ ప్లాంట్ల నిర్వాహకులకు కాసుల వర్షం కురుస్తోంది. ఇదిలాఉంటే పలు ప్రాంతాల్లో ప్లాంట్లు నిర్వహించే వారు సరైన ప్రమాణాలు పాటించడంలేదని తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. డబ్బు దండుకోవడంపై ఉన్న దృష్టి నీటి శుద్ధిపై పెట్టడంలేదని ఫలితంగా ప్రజారోగ్యం ప్రభావితమవుతుందని తనిఖీ సిబ్బంది సైతం తేల్చారు. అయినప్పటికీ పరిస్థితిలో గణనీయమైన మార్పులేవీ రాలేదని నాగర్‌కర్నూల్‌లోని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో మినరల్ వాటర్ ప్లాంట్లు నిర్వహించే కొందరు కనీస ప్రమాణాలను పాటించడంలేదని స్పష్టంచేస్తున్నారు. ప్రైవేటు ట్రీట్‌మెంటు ప్లాంట్ల నిర్వాహకులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నీటిని కొనుగోలు చేస్తున్నారని, ఇష్టారాజ్యంగా రసాయనాలు కలుపుతూ శుద్ధజలం పేరుతో విక్రయించేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ దందా ఉమ్మడిజిల్లా అంతటా సాగుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రమాణాలు పట్టించుకోకుండా తోచినట్లు రసాయనాలు కలుపుతూ ప్లాంట్ల నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఇటీవలిగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నీటిని నింపే డబ్బాలనూ శుభ్రం చేయడంలేదని ఈ నీళ్లలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటోందని నిపుణులు కూడా అంటున్నారు. ఈ నీటిని తాగడం ఎంత మాత్రం సురక్షితం కాదు. ఈ తరహా నీరు సేవిస్తే దీర్ఘకాలంగా ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. 

 

శుద్ధజలం పేరుతో కొందరు ప్రైవేటు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లాలో చాలాకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నీటిని పెద్ద మొత్తానికే విక్రయిస్తున్నా కనీస ప్రమాణాలు పాటించకపోవడాన్ని అంతా దుయ్యబడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పురపాలికలు, పట్టణాలు, మేజర్‌ గ్రామపంచాయతీల్లో  ఈ వ్యాపారం జోరుగా సాగుతోందని అయితే బాధ్యులపై చర్యలు తీసుకున్న దాఖలాలు చాలా తక్కువని అంటున్నారు. ప్రమాణాలకు తగ్గట్లుగా లేని నీటి వ్యావారం స్థానికంగా రూ.కోట్లలోనే సాగుతున్నట్లు సమచారం. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా నీటిని సరఫరా చేస్తుండడంతో ప్రజల ఆరోగ్యం ప్రభావితమవుతోంది. ప్రతి నెలా ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఎక్కడ అమలు కావడం లేదని పలువరు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి ప్లాంట్లలో నీటి శుద్ధి ప్రమాణాలకు తగ్గట్లుగా జరగాలని, పరిశుభ్రమైన నీరు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.

Related Posts