న్యూఢిల్లీ ఏప్రిల్ 11
నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ రాజ్యసభలో విపక్ష నేతను ప్రశ్నిస్తోందని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ కేసులో పలువురు కాంగ్రెస్ అగ్రనేతల ప్రమేయాన్ని ఈడీ, ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు. అవినీతి ఆరోపణల నేపధ్యంలో నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియా, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ లావాదేవీలపై దర్యాప్తు సంస్ధలు దృష్టి సారించాయి.ఇక నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో సోమవారం మల్లికార్జున్ ఖర్గేను ఈడీ అధికారులు ప్రశ్నించారు. యంగ్ ఇండియా, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)లో ఖర్గే కీలక బాధ్యతలు చేపట్టినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది ఈ కేసుకు సంబంధించి హర్యానాలో రూ 64 కోట్ల విలువైన ఆస్తిని ఈడీ అటాచ్ చేయడం కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. హర్యానాలోని పంచ్‌కులలో ప్లాట్‌ను ఏజేఎల్‌కు అప్పటి సీఎం భూపీందర్ సింగ్ హుడా చట్టవిరుద్ధంగా కట్టబెట్టారు.1982లో ప్లాట్‌ను ఏజేఎల్‌కు కేటాయించగా 1992, అక్టోబర్ 30న ప్లాట్‌ను ఈ ప్లాట్‌ను హుడా తిరి వెనక్కితీసుకుంది. కేటాయింపు లేఖలో పేర్కొన్న షరతులను ఏజేఐ నెరవేర్చలేదని హుడా ఆరోపించింది. ఇక 2005లో నిబంధనలకు విరుద్ధంగా అప్పటి హర్యానా సీఎం భూపీందర్ సింగ్ హుడా తన అధికారాన్ని ఉపయోగించి ఏజేఎల్‌కు రీఅలాట్‌మెంట్ పేరుతో రూ 59,39,200కు కట్టబెట్టారని ఈడీ ఆరోపించింది. 2011, ఫిబ్రవరి, 2017 జూన్‌లో ప్లాట్ విలువ మార్కెట్‌లో వరుసగా రూ 32.25 కోట్లు, రూ 64.93 కోట్లు కాగా అప్పటి సీఎం హుడాకు నష్టం చేకూరుస్తూ ఏజేఎల్‌కు అనుచిత లబ్ధి చేకూర్చారని ఈడీ ఆరోపించింది.