హైదరాబాద్ ఏప్రిల్ 12,
ఒక్క ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా.. మొన్నటి వరకు ఉత్తర, దక్షిణంగా ఉన్న నేతలు కలసి పనిచేస్తారా.. ఆ నేత ఢిల్లీ పదవి వద్దని కావాలనే రాష్ట్ర పదవి ఎందుకు తీసుకున్నట్లు.. ఇప్పటి వరకు రెండు వర్గాలుగా ఉన్న నేతలు.. ఇప్పడు కలిసి పనిచేయబోతున్నారు. ఆ నేతకు ఎ వర్గం సపోర్ట్ చేయనుందన్నదీ సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను వేధిస్తున్న ప్రశ్న.తెలంగాణ కాంగ్రేస్‌లో ఇప్పుడు నయా జోష్ కనిపిస్తుంది. వరుస కార్యక్రమాలతో మంచి ఊపు మీద ఉన్నారు పార్టీ నేతలు. అయితే, రాహుల్ గాంధీ మీటింగ్ తర్వాత నేతలంతా ఓక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇప్పటి వరకైతే ఐక్యతా రాగం వినిపిస్తున్న నేతలు.. ఇక మీదట ఎలా ఉంటారనే చర్చ పార్టీవర్గాల్లో జోరుగా సాగుతుంది. దీనికి కారణం లేకపోలేదు. ఉప్పు నిప్పుగా ఉండే భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇద్దరు టీ కాంగ్రేల్ కీలక పోజీషన్‌లో ఉన్నారు. మరి ఇద్దరు కలసి పనిచేస్తారా అనే అనుమానం కలుగుతుందట పార్టీ నేతలకు.ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ పదవి ఆశించినప్పటికి దక్కలేదు. అయితే, ఎఐసీసీలో కీలక పదవి వస్తుందని ఇన్ని రోజులు చెప్పుకొచ్చారు వెంకట్ రెడ్డి. అయితే ఏఐసీసీలో పదవి ఆఫర్ చేసినా కోమట్ రెడ్డి కావాలనే రాష్ట్ర పార్టీలో పదవి కావాలని కోరారట. దీంతో స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి అవకాశం కల్పించింది ఎఐసీసీ. అయితే ఇప్పడు పీసీసీగా రేవంత్ రెండ్డి, స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి ఏ మేరకు కలసి పనిచేస్తారనే చర్చ పార్టీలో జరుగుతుంది. స్టార్ క్యాంపెయినర్ హోదాలో రాష్ట్రం మోత్తం పర్యటించాలనే ఆలోచనలో ఉన్నారట కోమటిరెడ్డి. ప్రస్తుత సమయంలో కోమటిరెడ్డికి.. పీసీసీకి మధ్య చాలా గ్యాబ్ వచ్చినట్లు పార్టీ క్యాడర్ గుసగుసలాడుతున్నాయి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బహిరంగంగానే అనేక సార్లు విమర్శించిన కోమటిరెడ్డి.. ఇప్పడు ఆయనతో కలసి పనిచేస్తారా అనే అనే అనుమానం కలుగుతుందట పార్టీనేతలకు. పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం అంటూ పార్టీ నేతలే చెప్తారు. ఇలాంటి సమయంలో కోమటిరెడ్డి సీనియర్ల వర్గంలో ఉంటారని.. ఇప్పటికే సినియర్లకు రేవంత్‌కు మధ్య ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితిలో కోమటిరెడ్డికి ఏమేరకు సహకరిస్తారన్నదీ పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఏమేరకు జిల్లాల పర్యటను కోమటిరెడ్డికి అవకాశం ఇస్తారు. ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పడు వినిపిస్తున్నాయి.