చంద్రగిరి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ బాలికల పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ ఎస్సీ, ఎస్టీ,బిసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ పిల్లలను చదివించే స్తోమత లేని నిరుపేద కుటుంబాల బాలికలను ప్రభుత్వ హాస్టల్ కు పంపుతున్నారని, అలాంటి పిల్లలకు రక్షణ కల్పించాల్సిన హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తుందని, అందుకు ఉదాహరణగా ఇటీవలే జరిగిన ఇద్దరు ఎస్సీ బాలికలే ఉదాహరణఅని వారు తెలియజేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని చంద్రగిరి సిఐ శ్రీనివాసులు కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ పోరాట వ్యవస్థాపకులు బాదూరు ఎల్లయ్య, యానాదులు సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు వరమాల గోపి, పరాల పరమేశ్, శంకర్, నాగేశ్వరరావు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.