YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రరాష్ట్రానికి పోలవరం - మణిహారం. మంత్రి పదవిని బాధ్యతగా భావిస్తున్నా.

ఆంధ్రరాష్ట్రానికి పోలవరం - మణిహారం. మంత్రి పదవిని బాధ్యతగా భావిస్తున్నా.
సత్తెనపల్లి:
ఆంధ్రరాష్ట్రానికి పోలవరం మణిహారమని, నిర్మాణదశలో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేసేందుకు కృషిచేస్తానని ఆంధ్రరాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోమవారం మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సత్తెనపల్లి నియోజవకవర్గానికి చేరుకోవడంతో ప్రజాప్రతినిధులు, నాయకులు , కార్యకర్తలు భారీ స్వాగతం ఏర్పాటు చేశారు. ముందుగా ఆయన రాజుపాలెం మండలం దేవరంపాడులోని నేతి వెంకన్నస్వామి వారిని దర్శించుకుని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు.
అనంతరం పట్టణానికి చేరుకోగా నరసరావుపేట రోడ్డులోని చెక్‌ పోస్టు వద్ద నుండి అశేషజనవాహినితో ర్యాలీగా అమరావతి బస్‌ పాయింట్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ వేదిక వద్దకు వచ్చారు.హరిమిత్ర మండలి ఏర్పాటు చేసిన భారీ గజమాలను ధరించారు. ఆర్యవైశ్యనాయకులు వెలుగూరి శరత్‌ వెండికిరీటాన్ని మంత్రికి అందించారు. ఈ సందర్బంగా మంత్రివర్యులు అంబటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ఇచ్చిన ఈ అవకాశాన్ని పదవిలా కాకుండా కీలకమైన బాధ్యతగా భావిస్తానన్నారు.వైయస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టులు శంఖుస్ధాపన చేశారని, ఆయన కుమారుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారన్నారు.జలవనరుల శాఖ కీలకమైనదని రాష్ట్రానికి, ప్రభుత్వానికి, ప్రజలకు,నియోజకవర్గానికి మంచిపేరు తీసుకొచ్చేలా పారదర్శకంగా పనిచేస్తానన్నారు.
ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి సంస్కరణలతో , వాలంటీర్లు,సచివాలయాల వ్యవస్థ, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతో పరిపాలనను ప్రజల చెంతకు తీసుకొచ్చారన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా కోట్లరూపాయలు లబ్దిదారుల ఖాతాలో చేర్చుతున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
వేదికపై వైకాప రాష్ట్రకార్యదర్శి నిమ్మకాయల రాజానారాయణ,పర్యావరణ కార్పోరేషన్‌ చైర్మన్‌ గుబ్బా చంద్రశేఖర్‌, మున్సిపల్‌ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, ఏఎంసి చైర్మన్‌ రాయపాటి పురుషోత్తమరావు, జిల్లా రైతు సలహామండలి సభ్యులు కళ్లం విజయభాస్కరరెడ్డి,  వైస్‌ చైర్మన్‌  షేక్‌ నాగూర్‌మీరాన్‌, యువజన నాయకులు అచ్యుత శివప్రసాద్‌ తదితరులున్నారు.

Related Posts