కరీంనగర్, ఏప్రిల్ 12:
మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, వంట గ్యాస్, డీజిల్, విద్యుత్ చార్జీలు, బస్ చార్జీలు తగ్గించాలని రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ధర్నా లో పొన్నం ప్రభాకర్ తో పాటు మెంబర్షిప్ ఇంచార్జి మెదక్ సుప్రభాత రావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా పొన్నం మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 7.52 లక్షల ఎకరాల్లో వరి పంట రైతులు పండించారని, ఈ పంట ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉండగా, టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం వరి పండించిన రైతులను నోట్లో మట్టికొట్టి, ఒకరోజు ధాన్యాన్ని తూర్పార పట్టడం, ఇండ్లపై నల్ల జెండాలు ఎగుర వేయడం, మండల, జెడ్పి సర్వసభ్య సమావేశాల్లో తీర్మానాలను ప్రవేశపెడుతూ, జాతీయ రహదారుల పై టెంట్లు వేసి రాస్తారోకోలు చేసి రోడ్లు దిగ్బంధం చేయడం, చివరికి ఢిల్లీలో ధర్నాలు చేయడం లాంటి రోజుకో డ్రామా ఆడుతూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. యాసంగి పంట కోతకు సిద్ధంగా ఉన్న నేటివరకు ఐకెపి సెంటర్లు తెరువకపోవడం, పిఏసీఎస్, డీసీఎంఎస్ ల ద్వారా ఎక్కడెక్కడ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే దానిపై స్పష్టత లేకపోవడం, గన్నీ సంచులు, ప్యాడీ క్లినర్లు, తూకం యంత్రాలు, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన వంటి చర్యలు చేపట్టకపోవడం జిల్లా మంత్రి గా గంగుల ఘెరంగా విఫలమయ్యారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ను తెలంగాణ రైతులు, మంత్రులు పట్టించుకోవద్దని చెప్పిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయిస్తానని చెప్పి ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం కాదని, ప్రధాని మోదీతో మాట్లాడి బాయిల్డ్ రైస్ కొనిపించే దమ్ముందా అని సవాల్ చేశారు. మెంబర్షిప్ ఇంచార్జి సుప్రభాత రావు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో దళారుల మాయతో రైతులను నష్టానికి గురిచేస్తు ఆర్థికంగా దెబ్బతిస్తున్నారని, అందుకే ఆర్థిక ఇబ్బందులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, టిఆర్ఎస్ ప్రభుత్వ సూచనతో వరికి బదులు యసంగిలో ఇతర పంటలు వేసిన రైతులను కూడా మోసగించడం తగదన్నారు. రైస్ మిల్లుల్లో పేరుకుపోయిన రెండు సీజన్ల ధాన్యం పై నేటివరకు ప్రభుత్వం, సంబంధిత మంత్రి ప్రతి ధాన్యం గింజ కొంటామని, దానికి పూర్తి బాధ్యత మేమే వహిస్తానని మీడియా ముందు ప్రగల్భాలు పలికి ఇప్పుడు ధర్నా లు చేయడం సరికాదన్నారు. బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకు ఎన్నికల్లో ఓట్లను అవలీలగా కొనే వీరికి రైతుల వడ్లు కొనే సత్తా లేకపోవడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి మాట్లాడుతూ యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వీడి, రాజకీయాలు మానుకోవాలని టిఆర్ఎస్, బిజెపి లకు హితువు పలికారు. లేకుంటే టిఆర్ఎస్, బిజెపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతుల పంట చేతికి వచ్చే సమయంలో వడ్ల రాజకీయం చేపట్టారని, ఫలితంగా తగ్గించి దళారులను మిల్లర్ లను ప్రోత్సహించేలా చేస్తున్నారని అని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్ల రాజకీయంతో రైతులను బలి చేస్తున్నాయని అని విమర్శించారు. ప్రస్తుతం వడ్ల ధర రూ. 1230, 1300 పలుకుతోందని, రూ.1900 రూపాయలకు తగ్గితే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో ఏ విధంగా కొన్నారో ఇకముందు కూడా అలాగే కొనాల న్నారు. వరి వేస్తే ఉరి అంటూ కెసిఆర్, వరి వేయండి కేంద్రం కొనుగోలు చేస్తుందని బండి సంజయ్ చెప్పుతూ రైతులను ఆగం చేస్తున్నారన్నారని దుయ్యబట్టారు. రైతులు తిరగబడే రోజు వచ్చాయని, కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేత కాకుంటే ఎఫ్సిఐ ద్వారా కొనాలని, నష్టం వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలే తప్ప రైతులను నట్టేట ముంచటం సరికాదన్నారు. వడ్ల గురించి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు అవగాహన లేదన్నారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, అందులో సకల సౌకర్యాలు కల్పించకుంటే టిఆర్ఎస్, బిజెపి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇండ్లపై దాడులకు వెనుకాడ బోమని, అడుగడుగునా ఈ రెండు పార్టీల ప్రజాప్రతినిధులను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు.. సమద్ నవాబ్, రహ్మాత్ హుస్సేన్, చెర్ల పద్మ, యండి తాజ్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, మడుపు మోహన్, తిరుపతి రెడ్డి, బోనాల శ్రీనివాస్, లింగంపెళ్లి బాబు, కుర్ర పోచయ్య, ఖమరుద్దీన్, మామిడి సత్యనారాయణ రెడ్డి, గడ్డం విలాస్ రెడ్డి, దండి రవీందర్, యనమల మంజుల, కొరివి అరున్, నిహాల్, దన్న సింగ్, ఏజ్రా, పొరండ్ల రమేష్, జీడి రమేష్, శబనా మహమ్మద్, అజ్మత్, జీలకర్ర రమేష్, సలీమొద్దిన్, కీర్తి కుమార్, నదీమ్, చాంద్, బాబుల్ వర్మ, ఆమెర్ తదితరులు పాల్గొన్నారు.