భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 15
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ సతీమణి వసుమతిదేవి (65) తీవ్ర గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయకార్యదర్శి కూనంనేని సాంబశివరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం రామవరంలో జరిగిన సంస్మరణ సభలో నాయకులు మాట్లాడుతూ నారాయణకు వసుమతీదేవి చేదోడువాదోడుగా ఉండేవారని, అయన ఉద్యమ కెరీర్ వెనుక వసుమతీదేవి పాత్ర గొప్పదని అన్నారు. ఆప్కాబ్ బ్యాంకులో ఉద్యోగం చేసి కొన్నేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆమె టీవీ 99 డైరెక్టర్‌గా కొన్నాళ్లపాటు వ్యవహరించారని తెలిపారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఐనంబాకం గ్రామంలో అంత్యక్రియలు జరిగినట్లు తెలిపారు. అనంతరం మౌనంపాటించి శ్రద్ధాంజలి ఘటించారు. సంస్మరణ సభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు కంచర్ల జమలయ్య, వార్డ్ కౌన్సిలర్లు మునిగడప పద్మ, భూక్య శ్రీనివాస్ నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు, పెయ్యాల రంగారావు, పాటి మోహన్, ఎస్ కె ఫేహీం, వాకపల్లి హరినాధ్, జనార్దన్, గోపి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.