YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆకట్టుకుంటున్న ప్రధానుల మ్యూజియం

ఆకట్టుకుంటున్న ప్రధానుల మ్యూజియం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15,
మనదేశ రాజకీయాల్లో ప్రధానమంత్రులది కీలక స్థానం. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ ప్రధానమంత్రుల మ్యూజియం ప్రారంభమయింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్కు ప్రధాన మంత్రులుగా సేవలందించిన వారి జీవిత విశేషాలను వివరించేలా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు.ప్రతి యుగంలో, ప్రతి తరంలో ప్రజాస్వామ్యాన్ని మరింత సాధికారికంగా, ఆధునికంగా మార్చడానికి నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంది. మారుమూల పల్లె నుంచి, పేదరికం నుంచి, రైతు కుటుంబం నుంచి ప్రధాని పదవిని అలంకరించడం.. భారత ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని బలపరుస్తోంది. దేశంలో ప్రతి ప్రధాని తమ హయాంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ.. ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారన్నారు ప్రధాని మోడీ.తొలి పీఎం జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 14 మంది జీవిత విశేషాలు, వారు చేసిన సేవలు, సవాళ్లను ఎదుర్కొన్న తీరును ప్రధాన్మంత్రుల మ్యూజియంలో పొందుపర్చారు. దిల్లీ తీన్‌మూర్తి మార్గ్‌లోని నెహ్రూ మ్యూజియంలో ఏర్పాటైన దీనిని ప్రారంభించే ముందు.. ప్రధాని స్వయంగా టికెట్ కొని లోపలికి ప్రవేశించారు. మాజీ ప్రధానుల నాయకత్వ లక్షణాలు, ముందుచూపు, ఘనతలను.. ప్రస్తుత యువతరానికి తెలిపేలా చేయడమే దీని ఉద్దేశం అని ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.ఈ దేశ 14 మాజీ ప్రధానమంత్రులకు ఈ మ్యూజియం అంకితం చేశారు. మన దేశ ప్రధానమంత్రులు అధిగమించిన వివరాలను ఈ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. ఈ మ్యూజియంలో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జీవిత విశేషాలు, దేశ పురోగతికి ఆయన కృషికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పొందిన అనేక బహుమానాలను తొలిసారిగా ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియంలో 43 గ్యాలరీలు ఉన్నాయి. హోలోగ్రామ్‌లు, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మల్టీ టచ్, మల్టీ మీడియా, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్, ఇంటెరాక్టివ్ స్క్రీన్ వంటి నూతన సాంకేతికత సహాయంతో అందరినీ ఆకట్టుకోనున్నాయి.దేశ యువతను, కొత్త తరాలను నాయకత్వం వైపు పురికొల్పేలా, వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా ప్రధాని మోడీ తీసుకున్న కీలక నిర్ణయంగా ఈ సంగ్రహాలయాన్ని పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధానమంత్రుల నాయకత్వ, విజన్, వారి విజయాలపైనా అవగాహన పెంపొందించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని వెల్లడించింది.ఈ మ్యూజియం ఢిల్లీ మెట్రో స్టేషన్ ఎల్లో లైన్‌లోని లోక్ కళ్యాణ్ మార్గ్ లో వుంది. ప్రధానమంత్రుల మ్యూజియం సందర్శించాలంటే టికెట్ కొనుగోలు చేయాలి. టికెట్లు ఆన్‌లైన్‌లో తీసుకుంటే రూ. 100, ఆఫ్‌లైన్‌లో తీసుకుంటే.. రూ. 110. విదేశీయులకు ఈ టికెట్ ధర రూ. 750. కాగా, విద్యార్థులకు టికెట్ రేట్లతో తగ్గింపు వుంది. స్కూల్, కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు టికెట్లు కొంటే 25 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఐదు నుంచి 12 ఏళ్ల పిల్లలకు టికెట్‌లపై 50 శాతం తగ్గింపు ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

Related Posts