తిరుపతి, ఏప్రిల్ 16,
అవినీతిలో నుంచి పుట్టిన పార్టీ వైసీపీ. అవినీతి, కులం ప్రాతిపదికన వచ్చిన వైసీపీకి సహకారం ఉండదు. భాజపా, వైసీపీ మధ్య ఎక్కడా పొంతన లేదు".. ఇవేమీ ఆశామాషీగా చెప్పిన మాటలు కావు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ చేసిన స్టేట్‌మెంట్స్. అంతేనా.. "ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉంటుంది.. అమరావతికి బీజేపీ పూర్తిగా సహకరిస్తుంది.. రాజధాని ప్రాంతంలో కేంద్ర సంస్థలను ఏర్పాటు చేస్తున్నాం".. ఇలా మరింత క్లారిటీ ఇచ్చేశారు ఆయన. నందిగామలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి.. ఇలా వైసీపీకి ఝలక్ ఇచ్చారు సత్యకుమార్. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.వీర్రాజు, విష్ణు లాంటి ప్రొ-వైసీపీ బీజేపీ నేతల నుంచి ఇలాంటి డైలాగులు ఎక్స్‌పెక్ట్ చేయలేం. సో.. సత్య కుమార్ పక్కా యాంటీ వైసీపీ బీజేపీ లీడర్ అని తేలిపోతోంది. ఈ మధ్య ఏపీ పాలిటిక్స్‌లో సత్య కుమార్ బాగా యాక్టివ్ అయ్యారు. ఇటీవల గుంటూరులో జిన్నా సెంటర్ పేరు మార్చాలని డిమాండ్ చేసింది కూడా ఈయనే. అధిష్టానం అండతోనే.. ఏపీ బీజేపీని బలోపేతం చేయడానికి.. అధ్యక్షుడు వీర్రాజు వర్గంతో సంబంధం లేకుండా.. రాజకీయంగా దూసుకుపోతున్నారని అంటున్నారు. సత్య కుమార్ లాంటి నేత క్రియాశీల రాజకీయాలు చేయడం ఆహ్వానించదగిన పరిణామం అంటున్నారు ఏపీ కమలనాథులు.సత్యకుమార్. పక్కా రాయలసీమ రక్తం. జాతీయ కార్యదర్శిగా నేషనల్ లెవెల్ పరిచయాలు ఉన్నాయి. ఇటీవల యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రాంతానికి బీజేపీ ఇంఛార్జ్‌గా చేశారు. ఆయన వ్యూహాలతో ఆ డివిజన్‌లో మెజార్టీ స్థానాలు కొల్లగొట్టింది కమలదళం. దీంతో జాతీయ పార్టీతో పాటు రాష్ట్ర బీజేపీలోనూ సత్య కుమార్ పేరు మారుమోగిపోయింది. అందుకు అభినందిస్తూ.. విజయవాడలో ప్రత్యేకంగా ఓ సమావేశం పెట్టి మరీ.. సత్య కుమార్‌ను సన్మానించారు ఏపీ బీజేపీ నేతలు. అయితే, ఆ మీటింగ్ గురించి అధ్యక్షుడు సోము వీర్రాజుకు కనీసం సమాచారం కూడా లేకపోవడం ఆసక్తికరం. అంటే.. వీర్రాజుకు వ్యతిరేకంగా జాతీయ నాయకత్వమే సత్య కుమార్‌ను ప్రోత్సహిస్తోందా? అంటున్నారు. మంచిదే. సత్య కుమార్ లాంటి నేతలు ముందుండి పార్టీని నడిపిస్తే బీజేపీకి మంచిదే. జగన్‌ను నిలదీయడం, అమరావతిపై పోరాడటంలో ప్రస్తుత బీజేపీ నాయకత్వం పూర్తిగా విఫలం చెందిందనే అభియోగం ఉంది. పార్టీ ఇంచార్జ్ సునీల్ దియోదర్, వీర్రాజు, విష్ణు.. లాంటి బ్యాచ్ అంతా జగన్‌కు రహస్య స్నేహితులే అంటారు. పవన్ కల్యాణ్‌ను కావాలనే దూరం పెడుతూ వైసీపీకి లాభం చేకూర్చుతున్నారనే ఆరోపణ కూడా ఉంది. ఇలాంటి సమయంలో.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా.. లాంటి ప్రముఖులతో నేరుగా మాట్లాడగల సాన్నిహిత్యం ఉన్న సత్య కుమార్ లాంటి వారు.. ఏపీలో ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేపడితే బీజేపీకి మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే, జాతీయ కార్యదర్శి హోదా ఉన్న సత్య కుమార్.. నేరుగా రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టకపోవచ్చని.. ఆయన డైరెక్షన్‌లో వీర్రాజును సైడ్ చేసి.. కొత్త నాయకత్వాన్ని ముందుంచే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆ లోగా.. పార్టీ ఉనికిలో ఉండేలా.. ఇలా జిన్నా సెంటర్ ఇష్యూ.. వైసీపీ అవినీతి పార్టీ, బీజేపీ సహకారం ఉండదంటూ కామెంట్లు.. అమరావతి రాజధానికి మద్దతుగా స్టేట్‌మెంట్లు ఇస్తూ.. బీజేపీ లైన్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇకపైనా.. జగన్‌పై 'సత్య' పోరాటం కొనసాగుతుందని అంటున్నారు.