YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాపు రామచంద్రారెడ్డి అలక వీడరా...

కాపు రామచంద్రారెడ్డి అలక వీడరా...

అనంతపురం, ఏప్రిల్ 16,
రాష్ట్రంలో మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఒక్కర్ని బుజ్జగిస్తే.. మరో ఇద్దరు తెరపైకి వస్తున్నారు. తాజాగా ఈ పునర్వ్యస్థీకరణ రచ్చ.. అనంతపురం జిల్లాను కూడా తాకింది. నిన్నటి వరకు జిల్లాలో ఎలాంటి అలజడులు కనిపించ లేదు కానీ.. ఇప్పుడు ఏకంగా ఆవివాదం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బంద్ లకు కూడా దారి తీసింది.ఏపీలో మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ వైసీపీకి పెద్ద తలనొప్పిలా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 151స్థానాలు గెలవడంతో మంత్రి వర్గ రేసులో ఉండేవారి సంఖ్య దాదాపు 50 నుంచి 60మంది వరకు చేరింది. మొదట్లో సామాజిక వర్గాల ఈక్వేషన్స్ ప్రకారం చాలా మంది కొత్తవారిని తీసుకున్నా.. అప్పట్లో అంతా సర్దుకున్నారు. కానీ ఈసారి కూడా సీఎం జగన్ అదే ఫార్మూలా ఫాలో కావడంతో సీనియర్లు రగిలిపోతున్నారు. ఇందులో కొందరు ఓపెన్ గా తమ అసంతృప్తి చూపిస్తున్నారు.. మరికొందరు ఇన్ డైరెక్ట్ గా నియోజకవర్గాల్లో తమ కార్యకర్తలతో నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం ఇలాంటి నిరసనలు కనిపించలేదు. అసంతృప్తులు ఉన్నా.. ఎక్కడా బయట పడలేదు. అలాంటి జిల్లాల్లో ఉమ్మడి అనంతపురం కూడా ఒకటి. మంత్రి వర్గ రేస్ లో జిల్లాలో దాదాపు ఆరేడు మంది రేస్ లో ఉన్నారు. వారిలో బలంగా నలుగురు పోటీ పడ్డారు. చివరి నిమిషం వరకు పోటీ పడిన మాజీ మంత్రి శంకర్ నారాయణ, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిలకు లాస్ట్ మినిట్ లో నిరాశే ఎదురైంది.దాదాపు మంత్రి పదవి రాదనుకున్న ఉషాశ్రీ చరణ్ కు అవకాశం దొరికింది. అయినప్పటికీ ఎవరు నోరు మెదపలేదు. కానీ రెండు రోజుల తర్వాత రాయదుర్గం నియోజకవర్గంలో దీనిపై రచ్చ ప్రారంభమైంది. ఇక్కడ స్థానిక సంస్థల్లో కీలకంగా ఉన్న ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా ప్రెస్ మీట్ నిర్వహించారు. సీఎం జగన్ ఏ రోజు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటకు వచ్చారో.. ఆరోజు నుంచి ప్రతి అడుగులో కాపు రామచంద్రారెడ్డి ఉన్నారని.. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ అధిష్టానం తొలి కేబినేట్ లోనే కాపుకు పదవి ఇవ్వాల్సి ఉండేదని.. అప్పట్లో సామాజిక వర్గ సమీకరణాల పేరు చెప్పి మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు పునర్వ్యస్థీకరణలో కూడా అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. మా ఎమ్మెల్యే నియోజకవర్గానికివస్తే మంత్రి పదవితోనే రావాలని.. లేని పక్షంలో ఆయన కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నియోజకవర్గంలో నాయకులు, ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారుఇలాంటి వార్నింగ్ లో చాలా ప్రాంతాల నుంచి వచ్చాయి. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బంద్ కు పిలుపునిచ్చారు. రాయదుర్గంలో బంద్ నిర్వహించేందుకు నాయకులంతా రోడ్డు పైకి రాగా అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ ఆందోళనలు చేయవద్దని కానీ.. చేయమని కానీ ఎక్కడా ఓపెన్ స్టేట్ మెట్ ఇవ్వలేదు. ఇప్పటికి నియోజకవర్గానికి కూడా రాలేదు కాపు .మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ అంశంపై ఇప్పటికే సలహాదారు సజ్జలను కూడా కలిసినట్టు తెలుస్తోంది. జిల్లాలో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన తొలి ఎమ్మెల్యేను నేనేనని,మంత్రి పదవి వస్తుందని భావించినట్లు అమరావతి లో పెద్దలు వద్ద తన గోడు వినిపించినట్లు సమాచారం. చివరికీ సిఎం జగన్ సూచనతో కాపు వెనక్కు తగ్గినట్లు సమాచారం.సర్థుకోని పోవాలని అధినేత సూచించడంతో కార్యకర్తలకు నచ్చజెప్పే పనిలో కాపు ఉన్నట్లు సమాచారం.సీఎంని కలిశాక కాపు చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన తొలి ఎమ్మెల్యేను నేనే. మంత్రి పదవి వస్తుందని భావించాను. కానీ ఉష శ్రీ చరణ్ కి మంత్రి పదవి దక్కింది. నాకు మంత్రి పదవి రాలేదని నా కార్యకర్తలు కొందరు బాధపడ్డారు. అందరికీ నచ్చ చెప్పాను. మంత్రి పదవులు ఇంకా ఇవ్వలేం కాబట్టి.. సర్దుకుపోవాలని సీఎం జగన్ కోరారని చెప్పుకొచ్చారు కాపు రామచంద్రా రెడ్డి.

Related Posts