తిరుపతి
తిరుమలలో మరో వివాదం చెలరేగిందిజ తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్జిన తమిళ భక్తులకు అలిపిరి నడక దారి వద్ద చేదు అనుభవం ఎదురయింది. హర్మోనియం,తబలా లాంటి వస్తువులతో తిరుమలకు అనుమతించడం కుదరదని సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డకున్నారు. దాంతో తమిళ భక్తులుచ మాజీ పాలక మండలి సభ్యుడు బిజెపి నేత బాను ప్రకాష్ రెడ్డిని ఆశ్రయించారు. దాంతో అయన అలిపిరి వద్దకు చేరుకొని టీటీడీ తీరుపై మండిపడ్డారు. గత ముప్పై ఏళ్లుగా స్వామి సంకీర్తలతో తిరుమలకు నడిచే వెళ్ళేవాళ్ళం. గతంలో ఎప్పుడు ఇలాంటి సమస్య ఎదురు కాలేదని వారంటున్నారు. టీటీడీ వ్యవహరిస్తున్న తీరును భక్తులు తప్పు పడుతున్నారు. టీటీడీ తీరు మార్చుకోక పోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.