కందుకూరి వీరేశలింగం జయంతిని డోన్ పాతపేట జడ్పీ పాఠశాల లో ఘనంగా నిర్వహించారు, స్థానిక పాతపేట లో శనివారం ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షతన రావ్ బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా వీరేశలింగం గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు, ఈసమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ వీరేశలింగం గారు 16.4.1848 న రాజమండ్రిలో జన్మించారని, వారు సాంఘిక దురాచారాలను రూపుమాపి, మూఢ నమ్మకాలను పారద్రోలిన మహనీయుడు అని కొనియాడారు. తెలుగు ఉపాధ్యాయులు దేవేంద్రప్ప మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టేందుకు, చిన్న వయసులోనే భర్త చనిపోయిన వితంతువులకు పునర్వివాహం చేయడంలో, సామాజిక చైతన్యం పెంపొందించడంలో ఎంతో కృషిచేశారన్నారు,ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శివ ప్రసాద్, వెంకటేశ్వర్ గౌడ్, వెంకట రమణ, లక్ష్మయ్య, చంద్రశేఖర్ గౌడ్, సుబ్బారాయుడు, మధుసూదనరెడ్డి, శ్రీనివాసులు, సురేష్, ఆదినారాయణ, రమేష్, యు.శ్రీనివాసులు, భారతి, తదితరులు పాల్గొన్నారు.