అమరావతి, ఏప్రిల్ 16
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రిగా జోగి రమేశ్ పదవీ బాధ్యతలు చేపట్టారు.శనివారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకులో వేదపడింతుల ఆశీర్వచనం ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆయన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.బాధ్యతలు చేపట్టిన వెంటనే విశాఖపట్నంలో లక్ష మంది మహిళలకు ఇళ్ళ స్థలాలు ఇళ్ళు కట్టించేందుకు సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు.అలాగే ఇప్పటి వరకూ గృహనిర్మాణ లబ్దిదారులకు ఇస్తున్న90బస్తాల సిమ్మెంట్ ను 140 బస్తాలకు పెంచిన దస్త్రంపై రెండవ సంతకం చేశారు.ఈసందర్భంగా మంత్రి జోగి రమేశ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను గృహనిర్మాణ శాఖమంత్రిగా చేసి రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళలకు ఇళ్ళు కట్టించే బృహత్తరమైన బాధ్యతను అప్పగించారని అన్నారు. విశాఖపట్నంలోని మహిళలకు ఇళ్లు కట్టించకుండా కొంతమంది చాలా కాలంగా అడ్డుపడుతున్నారని కాని దానిపై కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో లక్ష మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ళు కట్టించేదుకు అవకాశం కలిగిందని చెప్పారు.ఇప్పటి వరకూ గృహనిర్మాణ లబ్దిదారులకు ఇస్తున్న 90 బస్తాల సిమ్మెంట్ ను 140 బస్తాలకు పెంచడం వల్ల లబ్దిదారులకు మరింత ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
నవరత్నాల్లో మేలిమి రత్నం గృహనిర్మాణ పధకమని అంతేగాక శాశ్వతమైనదని మంత్రి జోగి రమేశ్ అన్నారు.గతంలో కొద్దిమందికే ఇళ్ళు ఇచ్చేవారని కాని నేడు కుల మతాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి సాట్యురేషన్ విధానంలో ఇళ్ళు నిర్మించడం జరుగుతోందని చెప్పారు.తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి కృతజ్ణలు తెలియజేడంతోపాటు తనను రాజకీయంగా ప్రోత్సహించిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేగాక సమాజంలోని ఎస్సి,ఎస్టి,బిసి,మైనార్టీలకు సామాజిక న్యాయం చేస్తున్న సియం ఒక సామాజిక విప్లవవాదని,అభినవ పూలే అని,బిఆర్ అంబేద్కర్ కు అసలైన వారసునిగా సియం జగన్ మంత్రి జోగి రమేశ్ కొనియాడారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున,గృహనిర్మాణ సంస్థ ఎండి భరత్ గుప్త,తలసిల రఘురామ్ తదితర ఎంఎల్సిలు,ఎంఎల్ఏలు డి.నాగేశ్వర రావు,రక్షణ నిధి,మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని మంత్రికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.