మధిర ఏప్రిల్ 16
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క మధిర అసెంబ్లీ నియోజకవర్గ పాదయాత్ర మధిర మండలం బయ్యారం గ్రామపంచాయతీ పరిదిలో నిర్వహించారు. ఈ సందర్బంగా బట్టి మాట్లాడుతూ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర రాజకీయాల కోసం కాదు..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాసమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నానన్నారు.ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో 350 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను అచ్చే దిన్ తీసుకొస్తానని ఇప్పుడు 1050 రూపాయలకు పెంచి ప్రజలకు సచ్చే దిన్ తీసుకొచ్చాడని ఎద్దేవా చేసారు.8ఏండ్లల్లో ఎంత మందికి కొత్త ఫించన్లు , డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చారని ప్రశ్నించారు.ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరకుండా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం కోసం పీపుల్స్ మార్చ్ రణయాత్ర అని అన్నారు.ఈ యాత్రలో ఏఐఐసి జాయింట్ కో-ఆర్డినేటర్ ఇంచార్జ్ ఉల్లెంగల యాదగిరి,లో ఓబీసీ జాయింట్ కో-ఆర్డినేటర్ జడ్డి శేఖర్ గౌడ్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు గజెల్లి వెంకన్న, ఓబిసి జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్క శేఖర్ గౌడ్ , ఓబిసి జిల్లా ఉపాధ్యక్షులు.గాజెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.