హైదరాబాద్, ఏప్రిల్ 18,
ఎక్కడైనా ఎప్పుడైనా సీనియర్లదే హవా అని రాజకీయాలకు సంబంధించి పరిణామాలు తేలుస్తున్నాయి. పార్టీలను ఓ రకంగా ముంచుతున్నాయి కూడా ఇవే ! పరిణామ సంబంధ వికృతాలు. ఒకప్పుడు సీనియర్లు అంటే మిక్కిలి విధేయులు అని పేరు ఉండేది. తిరుగుబాటు ఉన్నా కూడా కొన్ని చోట్ల వీర విధేయులతో పార్టీలు గట్టెక్కేవి కానీ ఇప్పుడు అదేం లేదు అని తేలిపోయింది. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలలోనే కాదు ప్రాంతీయ పార్టీలలోనూ ఇలాంటి నియంతృత్వమే కనిపిస్తోంది.దీంతో తరుచూ అసంతృప్తతలకు ఆనవాలుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర మరియు తెలంగాణలో సీనియర్ల హవా కారణంగా కొన్ని చోట్ల జూనియర్ల మాట నెగ్గడం లేదు. పదవి ఉన్నా కూడా పార్టీ సంబంధ వ్యవహారాల్లో కూడా సీనియర్లే ఎక్కువ పై చేయి కనబరిచి వెళ్తున్నారు. దీంతో జూనియర్ ఎమ్మెల్యేలు మరియు కొందరు మంత్రులు వీళ్ల హవాను తప్పక అంగీకరించాల్సి వస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ జాతీయ పార్టీల కన్నా ప్రాంతీయ పార్టీల హవానే ఎక్కువగా నడుస్తోంది. ఇవే రూలింగ్ ఇస్తున్నాయి కూడా!అవశేషాంధ్రకు టీడీపీ ఒక సారి నేతృత్వం వహించి ప్రభుత్వం ఏర్పాటు చేసి సత్తా చాటుకుంది.ఆ రోజు కూడా కొందరు జూనియర్లు అసెంబ్లీ వరకే అరుపులకే పరిమితం అయ్యారు తప్ప పాలన సంబంధ వ్యవహారాల్లో తమ మార్కు చూపలేక చతికిలపడ్డారు. కొన్ని వ్యవహారాల్లో అతి చేసి గతి చెడగొట్టుకున్నారు కూడా! ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితిలోనూ తలనొప్పులు ఉన్నాయి. అయితే వీటిని పరిష్కరించేందుకు అధినాయకత్వాలు పెద్దగా చొరవ చూపడం కూడా లేదు అన్న విమర్శలు ఉన్నాయి.ఒకవేళ పరిష్కరించినా అవన్నీ తాత్కాలికమే తప్ప దీర్ఘకాలికంగా సీనియర్ల హవాను పార్టీ అధినేతలు అడ్డుకోలేక పోతున్నారన్న అభియోగాలు అటు చంద్రబాబుపై ఇటు జగన్ పై ఇంకా చెప్పాలంటే కేసీఆర్ పై కూడా ఉన్నాయి.కనుక సీనియర్ల తగ్గి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. జూనియర్లను ప్రోత్సహిస్తే ఇంకా మంచి రోజులు వస్తాయి ఆయా పార్టీలకు! అలా కాకుండా నువ్వెంత అంటే నేనెంత అనే ధోరణిలో కొట్టుకు చచ్చే కన్నా తగ్గి ఉండడమే మేలు.