తెలుగు,తమిళ బాషలలో ఒకేసారి తెరెకెక్కి మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది 'మహానటి' చిత్రం. ఈ చిత్రాన్ని చూసి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి చాల ఆనంద పడ్డారు. కానీ జెమినీ గణేశన్ కూతురు కమల సెల్వరాజన్ సినిమా చూసి ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘మహానటి’లో నాన్న పాత్రను తప్పుగా చిత్రీకరించారని,
ఆయన జీవితానికి కళంకం తెచ్చిపెట్టారని, సావిత్రే నాన్నకు మద్యం అలవాటు చేసింది అని జెమినీ గణేశన్ కుమార్తె కమలా సెల్వరాజ్ అన్నారు. కెరీర్ మొత్తం బిజీగా ఉన్న తన తండ్రిని అవకాశాలు లేక ఖాళీగా కూర్చున్నట్టు చూపించారని అన్నారు. ప్రేక్షకులు జెమినీ గణేశన్‌ను అంగీకరించకుంటే ‘కాదల్ మన్నన్’ (ప్రేమరాజు) అనే బిరుదు ఎందుకిస్తారని కమలా సెల్వరాజ్ ప్రశ్నించారు. సావిత్రిని కాపాడింది తన తండ్రే అని పేర్కొన్నారు.