YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గులాబీ ప్లీనరీకి వేళాయో

గులాబీ ప్లీనరీకి వేళాయో

హైదరాబాద్, ఏప్రిల్ 18,
మ‌రో పండుగ‌కు తెలంగాణ రాష్ట్ర స‌మితి సిద్ధం అవుతోంది. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావానికి స‌న్న‌ద్ధం అవుతోంది. ఇందుకు సంబంధించి హెచ్ఐసీసీ లో జ‌రుగుతున్నాయి. మాదాపూర్ హైటెక్స్ లో జ‌రిగే స‌మావేశానికి కేసీఆర్ హాజ‌రై అనేక విష‌యాల‌పై సుదీర్ఘ ఉప‌న్యాసం ఇస్తారు. పార్టీని జాతీయ పార్టీగా అనౌన్స్ చేసే అవ‌కాశం కూడా ఉంది. ఇదే సంద‌ర్భంలో పొత్తుల విష‌య‌మై ఓ క్లారిఫికేష‌న్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్లీన‌రీ ఏర్పాట్లను ఇవాళ కేటీఆర్ ప‌ర్య‌వేక్షించారు. నిర్వహ‌ణ బాధ్య‌త‌లు చూస్తున్న వారికి ప‌లు సూచ‌న‌లు ఇచ్చి వచ్చారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.ఆయ‌నేమ‌న్నారంటే..తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీకగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని శ్రేణులు పండుగగా జరుపుకోనున్నారు. ఇందుకు త‌గ్గ ఇక్క‌డ ఏర్పాట్లు చేస్తున్నాం. పార్టీని నెల‌కొల్పి 21 ఏళ్లు పూరైనందున హెచ్ఐసీసీలో ప్రతినిధు ల మహాసభను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నాం. 21వ ఆవిర్భావ దినోత్సవా నికి 3 వేల మంది ప్రతినిధులు హాజ‌రుకానున్నారు. ప్లీన‌రీ నిర్వ‌హ‌ణ‌పై చ‌ర్చ ఉంటుంది. ప్లీన‌రీ నిర్వ‌హ‌ణ‌కు హెచ్ఐసీసీ వేదికను ఫైనల్ చేశాం. 21 ఏళ్ల టీఆర్ఎస్ బాల్య దశ నుంచి ఎన్నింటినో దాటుకుని స‌వాళ్ల‌ను ఎదుర్కొని తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రించింది. దేశ రాజ‌కీయాల ను ప్ర‌భావితం చేసే పార్టీగా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన చ‌ర్చ ఉంటుంది. అదేవిధంగా రేప‌టి వేళ చేయ‌బోయే ప‌నులు సంబంధిత నిర్ణయాలు వార్షికోత్సవంలో కేసీఆర్ వెల్ల‌డి చేస్తారు.ఆహ్వానాలు అందినవారే ఆవిర్భావ సభకు రావాలి. సభకు వచ్చే వారికి పాసులు జారీ చేయ‌నున్నాం.12,769 గ్రామ శాఖలు సంబంధిత అధ్యక్షులు వారి , వారి ప్రాంతాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించాలి. అదేవిధంగా ప‌ట్ట‌ణాల‌కు సంబంధించి 3,600 చోట్ల పార్టీ ప‌తాకావిష్క‌రణను ఉత్స‌వాన్ని త‌ల‌పించే విధంగా నిర్వ‌హించాలి..అని చెప్పారు.ఇక ఆవిర్భావ వేళ కేసీఆర్ చెప్పే మాట‌లపైనే స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొని ఉంది. ఎందుకంటే గ‌తం క‌న్నా భిన్నంగా పార్టీ ఎదుగుద‌ల అన్న‌ది ఇవాళ కీల‌కం కానుంది. దేశ రాజ‌కీయాల్లో రాణించాల‌న్న ఆకాంక్ష‌తో కేసీఆర్ ప‌నిచేస్తున్నారు అన్న విష‌య‌మై ఎటువంటి సందేహం లేదు. పార్టీకి సంబంధించి కీల‌క బాధ్య‌త‌లు కేటీఆర్ కు అప్ప‌గించాక, యువ రాజు ప‌ట్టాభిషేకం అయ్యాక కేసీఆర్ త‌న నిర్ణ‌యాల‌ను వేగ‌వంతం చేస్తారా లేదా అన్న‌ది కూడా ఓ ఆస‌క్తిక‌ర చ‌ర్చ. ఇప్ప‌టికే దీన్నొక ఇంటి పార్టీగానే అంతా చూస్తున్నారు క‌నుక తెలంగాణ‌లో కేసీఆర్ మ‌నుషుల‌కు మ‌రియు ఆయ‌న మానియాకు తిరుగు లేద‌న్న‌ది నిస్సందేహం.కానీ ఇదే స‌మ‌యంలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఎదిగేందుకు చేసే ప్ర‌య‌త్నాల్లో భాగంగా ఒక‌వేళ రేప‌టి వేళ గులాబీ దండులో చీలిక తెచ్చే ప్ర‌య‌త్నం తెస్తే మాత్రం ఆ పార్టీ ఉనికికే ప్ర‌మాదం. ఇప్ప‌టికిప్పుడు రాష్ట్రంలో కొత్త పార్టీ ఏదీ ఎదిగేందుకు వీలులేకుండా ఉంది. ష‌ర్మిల తీసుకువ‌చ్చిన వైఎస్సార్టీపీ కూడా ఆశించిన విధంగా ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గ‌లేక‌పోతోంది. ఇక బ‌హుజ‌న రాజ్య స్థాప‌నే ధ్యేయం అంటూ తెర‌పైకి వ‌చ్చిన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కూడా ఎటువంటి ప్ర‌భావం బీఎస్పీ త‌రఫున చూప‌లేక‌పోయారు. ఈ త‌రుణాన పార్టీని ఇత‌ర ప్రాంతాల‌కు విస్త‌రింప‌జేయాల‌న్న బ‌లీయ‌మైన కాంక్ష‌తో కేసీఆర్ ఉన్నారు కానీ ఆ విధంగా అనుకూల పరిణామాలు ముందున్న కాలంలో చోటు చేసుకోనున్నాయా అన్న‌దే ప్ర‌శ్న‌. సందిగ్ధావ‌స్థ కూడా!

Related Posts