YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

వారంలో పోలీసు నియమాకాలకు నోటీఫికేషన్

వారంలో పోలీసు నియమాకాలకు నోటీఫికేషన్

సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటాన్ చెరు ఎస్ ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్ రావు  సోమవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ వారంలో పోలీస్ నోటిఫికేషన్.. సిద్దంగా ఉండండి. మేము అన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నాం..కేంద్రంలో 15 లక్షల పైగా  పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ధరలు పెంచినందుకు, ఉద్యోగాలు  ఇవ్వనందుకు, ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నందుకు యాత్ర చేస్తున్నారా..? ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి బిజెపి లబ్ధి పొందాలని చూస్తున్నది. తెలంగాణ విద్యార్థులు ఉద్యోగాల భర్తీ గురించి ఎక్కడికక్కడ బీజీపీ ని నిలదీయండి. ట్విట్టర్ వేదికగా మోడీ, బండి సంజయ్, కిషన్ రెడ్డిలను ప్రశ్నించండని అన్నారు.
విద్యార్థుల కోరిక మేరకు సిఎం కేసీఆర్ 3 ఏళ్ల వేయోపరిమితి రిలాక్సేషన్ ఇచ్చారు. 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశారు. పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం దేశంలో ఎక్కడా లేదని అయన అన్నారు.

Related Posts