యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కపురం గ్రామంలో మన ఊరు మన బడి మౌలిక వసతుల బలోపేతం కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి హజరయ్యారు. అధికారిక కార్యక్రమానికి గ్రామీణ నీటి పధకం డీఈ గైర్హాజరు పై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేసారు. తుక్కపురం ప్రభుత్వ పాఠశాల క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మంజూరు అయిన నిధులు ఎలా ఖర్చు చేయాలో అనే ఆలోచనతో కాకుండా సమర్ధ వంతమైన సదుపాయాల కల్పన కొరకు పని చేయాలని అన్నారు. పాఠశాలలోని మరుగుదొడ్లు, మూత్రశాలలను పరిశీలించి అసహనం వ్యక్తం చేసారు. .