YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాకాణికి కేసుల బెడద

కాకాణికి కేసుల బెడద

నెల్లూరు, ఏప్రిల్ 19,
కాకాణి గోవర్దన్‌రెడ్డి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే తొలి కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించారు కాకాణి. కానీ.. అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటీ. ఇటీవల చేపట్టిన కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో మాత్రం ఆశ నెరవేరింది. పొలిటికల్‌గా జీవితాశయం నెరవేరిందన్న సంతోషంలో ఉండగానే.. సొంత జిల్లా నెల్లూరులో కాకాణికి కొత్త కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి. వాటి గురించే ఇప్పుడు అధికారపార్టీలో.. పొలిటికల్‌ సర్కిళ్లలో జోరుగా చర్చ జరుగుతోంది.మంత్రిగా కాకాణి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌.. జర్క్‌ ఇచ్చారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు తనపట్ల కాకాణి ఎంత ప్రేమ.. అనురాగం కురిపించారో.. సహకారం అందించారో అంతకు రెట్టింపు ఇస్తారనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు అనిల్‌. ఆ కామెంట్స్‌పై చర్చ జరుగుతున్న సమయంలోనే మంత్రి కాకాణికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు సిటీలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. ఇది అనిల్‌ వర్గం పని అనేది కాకాణి అనుచరుల అనుమానం.మంత్రిగా సొంత జిల్లాలో కాకాణి అడుగుపెడుతున్న రోజే.. నెల్లూరులో అనిల్‌ బహిరంగ సభ పెట్టడం కూడా చర్చగా మారింది. ఇది బల ప్రదర్శన కాదని అనిల్‌ వర్గం చెబుతున్నా.. తన వర్గం నుంచి ఎవరూ కాకాణి దగ్గరకు వెళ్లకుండా కట్టడి చేయడానికి సభ పెట్టారన్నది కొందరి అభిప్రాయం. ఇంతలో కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు రాష్ట్రంలో సంచలనం రేపింది. ఐదేళ్ల క్రితం టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి… కాకాణిపై పెట్టిన కేసు అనూహ్య మలుపు తీసుకుంది. విదేశాల్లో తనకు వేల కోట్లు ఉన్నాయన్న కాకాణి ఆరోపణలపై సోమిరెడ్డి కేసు పెట్టారు. కాకాణి చూపించిన పత్రాలు నకిలీవిగా తేలడంతో ఆ కేసులో కాకాణి Aవన్‌గా ఉన్నారు. ఈ కేసు విచారణకు వచ్చే తరుణంలో కీలకంగా భావిస్తున్న డాక్యుమెంట్లు కోర్టు నుంచి చోరీ అయ్యాయి.చోరీ వెనక కాకాణి వర్గం ఉందన్నది టీడీపీ ఆరోపణ. శిక్ష పడుతుందని తెలిసే సాక్ష్యాలను మాయం చేశారని.. ఈ అంశంపై సుప్రీంకోర్టు వరకు వెళ్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. కోర్టులో చోరీ కూడా మంత్రి కాకాణి శిబిరాన్ని ఇరకాటంలో పడేసిందని టాక్‌. ఒకవైపు సొంతపార్టీ నేతల వ్యంగ్యాస్త్రాలు.. ఫ్లెక్సీల చించివేత.. బలప్రదర్శన.. ఇంకోవైపు కోర్టులో చోరీ.. మంత్రికి ఆదిలోనే హంసపాదుగా మారాయని వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అందుకే రానున్న రోజులు మంత్రిగా కాకాణికి సొంత జిల్లాలో ముళ్లబాటేనని అభిప్రాయపడుతున్నారట.
కేసుల పరంపర ఇదీ
ఇటీవ‌ల ఎవ‌రిపై ఇంత ర‌చ్చ జ‌ర‌గ‌లేదు. ఇటీవ‌ల ఏ కేసులోనూ ఇంత సంచ‌ల‌నం నెల‌కొన‌లేదు. ఆయ‌న మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. రోజుల వ్య‌వ‌ధిలోనే ఏకంగా కోర్టులోనే దొంగ‌త‌నం జ‌రిగింది. మంత్రి కేసు తాలూకూ సాక్షాధారాలు మాత్ర‌మే ఎత్తుకెళ్లారు. దొంగ‌లు దొరికినా.. వారికి రాజ‌కీయ సంబంధం లేద‌ని తేల్చారు. క‌ట్ చేస్తే.. అదే మంత్రి కాకాణి విల్లాలో ఓ వ్య‌క్తి అనుమానాస్ప‌దంగా చనిపోయాడు. ఇలా, సినిమాటిక్‌గా సాగుతున్న మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి ఎపిసోడ్ పొలిటిక‌ల్‌గా ఫుల్ కాంట్ర‌వ‌ర్సీగా మారింది. ఓవైపు మాజీ మంత్రి అనిల్‌కుమార్.. పోటీ స‌భ‌లు, ప్రెస్‌మీట్లు, స‌ర్వేప‌ల్లిలో ప‌ర్య‌ట‌న‌ల‌తో కాకాణిని స‌వాల్ చేస్తుంటే.. మ‌రోవైపు, వ‌రుస ఘ‌ట‌న‌లు కొత్త మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా, టీడీపీ సైతం రంగంలోకి దిగి.. కాకాణిని అనుమానాలు, ప్ర‌శ్న‌లతో కుమ్మేయడంతో.. కాకాణికి మంత్రి అయ్యాననే సంతోషమే లేకుండా పోయింది. కాకాణి గోవర్థన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అరాచక పర్వానికి తెర తీశారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. కాకాణి ఏడు కేసుల్లో ముద్దాయని గుర్తు చేశారు. నెల్లూరు కోర్టు చోరీపై చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. సెలవు రోజు కోర్టు ఉద్యోగి.. కోర్టుకు ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. కాలువలో సంచి ఉన్నట్లు ఎలా చెప్పాడన్నారు. ఎస్పీ కల్పిత కధ అల్లారని, వేల కేసుల ఫైల్స్ ఉంటే కేవలం కాకాణి కేసుకు చెందిన ఆధారాలున్న బీరువా మాత్రమే దొంగ‌ల‌కు కనిపించిందా? అని నిల‌దీశారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా చోరీ జరగలేదని ధూళిపాళ్ల అనుమానం వ్యక్తం చేశారు.మంగళగిరిలోని కాకాణి విల్లాలో మహమ్మద్‌ అనే వ్యక్తి చనిపోయారు. ఏసీ మెకానిక్‌ మహమ్మద్‌ మృతిపై చాలా అనుమానాలున్నాయి. మహమ్మద్‌ మృతికి.. చోరీ కేసుకు ఉన్న సంబంధమేంటి? సుమోటోగా న్యాయమూర్తులే సీబీఐ విచారణ జరిపించాలి. పోలీసులు దర్యాప్తుతో ఎలాంటి ఉపయోగం ఉండదు" అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.మ‌రోవైపు, విల్లాలో శ‌వం వ్య‌వ‌హారం కాకాణి మెడ‌కు చుట్టుకుంటోంది. మంగ‌ళ‌గిరిలో మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డికి చెందిన విల్లాలో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. శనివారం ఉదయం మరణించగా, ఆదివారం ఉదయం వరకు విష‌యం గోప్యంగా ఉంచారు. విద్యుత్‌ షాక్‌తో చనిపోయాడని పోలీసులు చెబుతుండగా, హత్య చేశారని యువకుడి బంధువులు ఆరోపించారు. ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన చేపట్టేందుకు బంధువులు సిద్ధమమ‌గా.. మంత్రి పీఏ రంగప్రవేశం చేసి స్థానిక వైసీపీ నేతల సాయంతో మృతుడి కుటుంబీకులతో బేరాలకు దిగినట్టు తెలుస్తోంది. మృతుడి కుటుంబీకులు రూ.12 లక్షలు ఇవ్వాలని పట్టుబట్టగా.. చివరకు 6 లక్షలకు ఒప్పించారు. అందులో మంత్రి కాకాణి 3 లక్షలు, మెకానిక్‌ షాపు యజమాని షేక్‌ యూసూబ్‌ 3 లక్షలు ఇచ్చేలా డీల్‌ కుదిరినట్టు సమాచారం.

Related Posts