YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ధర్మాన సుక్తిముక్తావళి

ధర్మాన సుక్తిముక్తావళి

శ్రీకాకుళం, ఏప్రిల్ 19,
మర్మం లేకుండా మాట్లాడేస్తారు. మెలితిప్పే కామెంట్స్‌ అస్సలు ఉండవు. సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. ఇన్నాళ్లూ ఆయన ఏం చెప్పినా చర్చే. ఇప్పుడు మాత్రం ఆయన మంత్రి. అభినందన సభలోనే నర్మగర్భ వ్యాఖ్యలతో కలకలం రేపారు. కాకపోతే ఆ ధర్మ సూక్తులు ఎవరికన్నదే ప్రస్తుతం ప్రశ్న.హాట్ టాపిక్‌గా మంత్రి ధర్మాన కామెంట్స్‌ ధర్మాన ప్రసాదరావు. తాజా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో చోటు దక్కించుకున్నారు. చాలా గ్యాప్‌ తర్వాత మంత్రి హోదాలో జిల్లాకు రావడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు శ్రీకాకుళం హైస్కూల్‌ గ్రౌండ్‌లో సభ ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ సభలో మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలే హాట్ టాపిక్‌గా మారాయి.ప్రసాదరావు అన్నయ్య కృష్ణదాసే రెవెన్యూ మంత్రి. రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువైందనేది ధర్మాన మాట. సదరు రెవెన్యూ శాఖకు ఇంత వరకు మంత్రిగా ఉన్నది ఆయన అన్నయ్య ధర్మాన కృష్ణదాసే. తన విభాగంలో పారదర్శక పాలన అందిస్తున్నామని.. బ్రిటిష్‌ కాలంలో భూములకు రీ సర్వే చేస్తూ.. యజమానికి శాశ్వత భూ హక్కు పత్రాలు అందజేస్తున్నట్టు కృష్ణదాస్‌ డిప్యూటీ సీఎం హోదాలో అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే కేబినెట్‌లో అన్న చోటు కోల్పోయారు. ఆ స్థానంలో వచ్చిన ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖను చేపట్టడమే కాకుండా.. అవినీతి ఎక్కువైందనే విమర్శలు చేయడం కలకలం రేపుతోంది. అన్న కృష్ణదాస్‌కు కౌంటర్‌ వేశారని కొందరు భావిస్తుంటే.. ఆయన కామెంట్స్‌ ప్రభుత్వానికి , పార్టీకి మేలు చేస్తాయా.. కీడు కలిగిస్తాయా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పనితీరు.. తాజా మంత్రివర్గ కూర్పు.. వైసీపీ అవలంభిస్తున్న విధానాలకు కాస్త దూరంగా జరిగి.. మంత్రి ధర్మాన మాట్లాడినట్టు భావిస్తున్నారు.కులం, మతం చూసి జనం ఓట్లేయబోరన్న ప్రసాదరావు గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నాయని వైసీపీ అగ్రనేతలు ఇటీవల కాలంలో తరచూ చెబుతూ వస్తున్నారు.అక్కడితో ఆగితే బాగోదనుకున్నా ఏమో.. నిజాయితీ కలిగిన పాలనకే విలువ ఉందని.. ఆ దిశగా ప్రభుత్వాన్ని, పార్టీని తీసుకెళ్లాలని ధర్మ సూక్తులు చెప్పారు ధర్మాన. ఈ కామెంట్స్‌తో సొంత పార్టీవాళ్లనే ఇబ్బందుల్లోకి నెట్టారని కొందరి అభిప్రాయంగా ఉందట.సొంతపార్టీని ధర్మాన ప్రసాదరావు పొగిడారా..? తిట్టారా..? ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు ఉదహరించిన అంశాలూ చర్చగా మారాయి. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, కేరళ సీఎం విజయన్‌, బెంగాల్‌ సీఎం మమత, బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌, ఆప్‌ పంజాబ్‌ విజయాలను ప్రస్తావించారు. కానీ… సొంత ప్రభుత్వానికి ఆ జాబితాలో చోటు ఇవ్వలేదు. దీంతో ప్రసాదరావు తిట్టారో పొగిడారో అర్ధం కావడం లేదని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రజలు కోరుకోవడం వల్లే తనకు మంత్రి పదవి ఇచ్చారని సెలవిచ్చిన ప్రసాదరావు.. కేబినెట్‌లో చోటు కోసం ఏనాడూ సీఎంను అడగలేదని.. ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించనూ లేదని తెలిపారు. మొత్తానికి పార్టీ అధిష్ఠానం చెబుతున్న మాటలకు.. మంత్రిగా ధర్మాన చేస్తున్న కామెంట్స్‌కు ఎక్కడా పొంతన కుదరడం లేదు. దీంతో రానున్న రోజుల్లో ఇంకెన్ని బాంబులు పేలుస్తారో అనే ఆసక్తి పార్టీ శ్రేణుల్లో నెలకొందట.

Related Posts