YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తమిళసై పై ఊహాగానాలు

తమిళసై పై ఊహాగానాలు

చెన్నై, ఏప్రిల్ 19,
ప్రభుత్వంతో విభేదాలు తెలంగాణ గవర్నర్ తమిళసై మార్పునకు కారణమయ్యాయా? రాజ్ భవన్, ప్రభుత్వం మధ్యా అగాధం గవర్నర్ పదవికే ఎసరు పెట్టింది అని చెబుతున్నారు. కేంద్రం, తెరాస సర్కార్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాష్ట్ర రాజకీయాలు సెగలు కక్కుతున్న నేపథ్యంలో గవర్నర్- ప్రభుత్వం మధ్య రిఫ్ట్ రాజకీయంగా తమకు నష్టం చేస్తుందన్న భావనతోనే కేంద్రం గవర్నర్ మార్పునకు మొగ్గు చూపిందంటున్నారు. బీజేపీ తమిళనాడు శాఖ ఉపాధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పని చేసిన తమిళసై  2019 సెప్టెంబర్ 1న తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్ గా ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముఖ్యంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి కౌశిక రెడ్డి నియామకంపై అభ్యంతరం చెప్పడం, అలాగే ప్రజా దర్బార్ పేరుతో ప్రజలతో ముఖాముఖి సమావేశాలు కేసీర్ సర్కార్ తో విభేదాలకు కారణమయ్యాయి. దీంతో రాజ్ భవన్- ప్రభుత్వం మధ్య అగాధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ ను బీజేపీ కార్యాలయంగా మార్చేశారంటూ తెరాస మంత్రులు ఆమెపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతున్న నేపధ్యంలో ఇటువంటి విమర్శలు రాజకీయంగా నష్టం చేస్తాయన్న భావన రాష్ట్ర బీజేపీ వర్గాలలోనే వ్యక్తమౌతున్న నేపథ్యంలో నష్ట నివారణకు ఆమెను మార్చడమే ఖాయమని బీజేపీ అధిష్టానం భావంచి ఆమెను మార్చేందుకు నిర్ణయించుకుందని అంటున్నారు.  దీంతో  తెలంగాణ గవర్నర్ తమిళసై మార్పు ఖాయమన్న వార్తలు రాజకీయ వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. స్వల్ప వ్యవధిలో ఆమె రెండో సారి హస్తి వెళ్లడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. పది రోజుల కిందట తమిళసై హస్తిన వెళ్లి నప్పుడు ఆమె ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె వారికి ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని హస్తినలోనే విలేకరుల సమావేశం పెట్టి మరీ వెళ్లడించారు. తద్వారా అప్పటి దాకా రాజ్ భవన్- ప్రభుత్వం మధ్య అగాధమేర్పడిందన్నవి ఊహాగానాలు కావు పచ్చినిజాలని గవర్నర్ కుండ ద్దలు కొట్టేశారు. ఇప్పుడు మళ్లీ గవర్నర్ హస్తిన వెళ్లారు. ఒక ప్రజా ప్రతినిథి తనయుడి వివాహానికి వెళ్లినట్లు చెబుతున్నప్పటికీ హస్తిన పిలుపు మేరకేనని తెలుస్తోంది.
ఈ సారి ఢిల్లీ పర్యటన తమిళసైని తెలంగాణ గవర్నర్ గా మారుస్తున్నట్లు తెలియజేయడానికేనని అభిజ్ణ వర్గాల భోగట్టా.తెలంగాణ కొత్త గవర్నర్ గా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ లేదా, కర్నాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నసీనియర్ నేత కేసీ రామమూర్తిలలో ఒకరిని నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం తమిళసై తెలంగాణ గవర్నర్ గానే కాకుండా పుదుచ్చేరి ఇన్ చార్జి గవర్నర్ గా కూడా కొనసాగుతున్నారు. అయితే పుదుచ్చేరికి తమిళసైని పూర్తి స్థాయి గవర్నర్ గా నియమించే అవకాశాలు కూడా లేవని చెబుతున్నారు.  తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా పని చేసిన తమిళసైకు ఆ రాష్ట్రంలో రాజకీయ పునరావాసం లభించే అవకాశాలు కూడా లేవని అంటున్నారు. ఉపాధ్యక్షురాలిగా పని చేసిన ఆమె సహజంగానే అధ్యక్షురాలిగా ఎలివేషన్ కోరుకుంటారు. అయితే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఐపీఎస్ అన్నామళై సమర్ధంగా పార్టీని  నడుపుతున్న నేపథ్యంలో తమిళసైకి ఆ అవకాశం కూడా లేదని అంటున్నారు.

గవర్నర్ పై ట్రోలింగ్...
గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, సీఎం కేసీఆర్ మ‌ధ్య మొద‌లైన వార్‌ మ‌రింత తీవ్ర రూపం దాల్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. త‌న‌ను లెక్క చేయ‌డం లేద‌ని, త‌గిన మ‌ర్యాద ఇవ్వ‌డం లేద‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఫిర్యాదును కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ర్ట ప్ర‌భుత్వానికి చెక్ పెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా త‌మిళిసైని మ‌రో రాష్ర్టానికి బ‌దిలీ చేసి బ‌ల‌మైన గ‌వ‌ర్న‌ర్ ను నియ‌మించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు త‌మిళ‌నాడుకు చెందిన ఓ వెబ్ పోర్ట‌ల్ సంచ‌ల‌న క‌థ‌నాన్నిప్ర‌చురించింది.కౌశిక్ రెడ్డి వ్య‌వ‌హారంతో సీఎం కేసీఆర్‌, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై మ‌ధ్య అంత‌రం అంత‌కంత‌కూ పెరిగిపోతున్న విష‌యం తెలిసిందే. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్య‌ర్థిత్వాన్ని గ‌వ‌ర్న‌ర్ ఆమోదించ‌ని విష‌యం తెలిసిందే. దాంతో అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను రాష్ర్ట ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే నిర్వ‌హించింది. ఇందుకు సాంకేతిక కార‌ణాల‌ను చూపించింది. రాజ్ భ‌వ‌న్ లో ఉగాది వేడుల‌కు గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానించినా ప్ర‌భుత్వం త‌ర‌పు నుంచి ఎవ‌రు రాలేదు. భ‌ద్రాచ‌లం, స‌మ్మ‌క్క జాత‌ర ప‌ర్య‌ట‌న‌లోనూ గ‌వ‌ర్న‌ర్ కు ప‌రాభ‌వం ఎదురైంది. దాంతో గ‌వ‌ర్న‌ర్ నేరుగా ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను క‌లిశారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ‌లో డ్ర‌గ్స్‌. అవినీతి అంశాల‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో రాష్ర్ట మంత్రులు కూడా ప్ర‌త్యేకంగా మీడియాతో మాట్లాడుతూ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై పై విరుచుకుప‌డ్డారు. చివ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థే దండ‌గ అంటూ మండిప‌డ్డారు. ఈ క్ర‌మంలో కేంద్ర మంత్రి కుమారుడి పెళ్లికి హాజ‌ర‌య్యేందు ఢిల్లీకి వ‌చ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. త‌న‌న మంత్రులు తీవ్రంగా అవ‌మానించార‌ని, పాత వీడియోల‌తో సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Related Posts