ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల మధ్య కొత్త చిచ్చు రగులుతోంది. గ్యాస్ట్రో ఎంట్రాలజీ సర్జికల్ విభాగాన్ని ఉస్మానియా ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఈ వివాదానికి కారణం. ఈ రెండు ఆసుపత్రులూ ప్ర భుత్వ ఆధ్వర్యంలో కొనసాగేవే అయినా ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉస్మానియా ఆసుపత్రి వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. మొదటి నుంచీ ఉస్మానియా ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ మెడికల్ విభాగంతో పాటు సర్జికల్ విభాగం కూడా కొనసాగుతోంది. కానీ గాంధీలో మాత్రం కేవలం మెడికల్ విభాగం మాత్రమే ఉంది. ప్రస్తుతం గాంధీ ఆసుప్రతిలో ఐదు కొత్త థియేటర్లను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు సంబంధిం చి నిధులను కూడా విడుదల చేసింది. ఇందులో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి సంబంధించిన థియేటర్ కూడా ఉంది. ప్రస్తుతం రెండు ఆసుప్రతుల్లోనూ లివర్‌కు సంబంధించిన అపరేషన్లు కొ నసాగుతున్నాయి. కాలేయ మార్పిడికి సంబంధించిన చికిత్స మాత్రం ఒక్క ఉస్మానియా ఆసుపత్రిలోనే కొనసాగుతుంది. అయితే ఉస్మానియాలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాన్ని గాంధీ ఆసుపత్రికి తరలిస్తే ఏ మా త్రం సహించేది లేద ని తెలంగాణ డాక్టర్ల మెడికల్ అసోసియేషన్ జెఎసి ఛైర్మన్ డాక్టర్ బి.రమేష్ స్ప ష్టంచేశారు. ఉస్మానియాలోని డాక్టర్ అక్కడికెళ్ళి పనిచేస్తానంటే తమకెలాంటి అభ్యంతరం లేదని కానీ ఉద్యోగులు, సి బ్బందిని తరలిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అసలు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం అనేది మెడికల్ గ్యాస్ట్రోతో అనుసంధానం కలిగి ఉంటుందన్నారు. దీన్ని వేరుచేయడం సరికాదన్నారు. దీనివల్ల ఉస్మానియా ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీకి కూడా నష్టం వాటిల్లే ప్రమాదముందన్నారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో సేవలను మెరుగుపర్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగం గా ఈ విభాగాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించేలా వైద్య, విద్యా సంచాలకుల కార్యాలయం గత ఏడా ది డిసెంబర్ 5వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులో స్పెషలిస్టులను మాత్రమే పంపించాలని ఉన్నప్పటికీ ఇటీవల డిఎంఇ కార్యాలయం నుంచి ఉస్మానియా సూపరింటెండెండ్ అందిన లేఖలో మాత్రం సర్జికల్‌కు సంబంధించి పూర్తి సా మాగ్రి, పరికరాలతో పాటు డాక్టర్లు, స్పెషలిస్టులు, నర్సులు, వార్డుబాయ్‌లు, కుర్చీలు లాంటి ఫర్నీచర్‌ను కూడా తరలించాలని ఉన్నట్లు ఉస్మానియా వ ర్గాలు ఉదహరిస్తున్నాయి. తెలంగాణ మెడికల్ జెఎ సి డాక్టర్లు సైతం డిఎంఇ లేఖను తీవ్రంగా నిరసిస్తున్నారు. ఉస్మానియాలో ప్రస్తుతం కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని, అక్కడికి మార్చ డం వల్ల రోగులు ఇబ్బందిపడే అవకాశముందనే అభిప్రాయపడ్డారు. గాంధీ ఆసుపత్రిలో కొత్తగా వి భాగాన్ని ఏర్పాటు చేయాలే తప్ప ఒక ఆసుపత్రిలో ని విభాగాన్ని మరో ఆసుపత్రికి తరలించడం సరికాదని వ్యాఖ్యానించారు. రెండూ ప్రభుత్వ ఆసుపత్రులే అయినప్పటికీ ఉస్మానియా ఆసుపత్రిపై ఒక రకమైన ప్రేమను, గాంధీ ఆసుపత్రి మట్ల మరో రకమైన ప్రేమను చూపించడం సవతి తల్లి ప్రేమ తరహాలో ఉందని వ్యాఖ్యానించారు.ఉస్మానియా ఆసుప్రతిలోని సర్జికల్ గ్యా స్ట్రో ఎం ట్రాలజీ వి భాగాన్ని తరలింపు ప్రక్రియ తాత్కలికమేనని డిఎంఇ డాక్టర్ రమేష్‌రెడ్డి స్పష్టంచేశారు. గాం ధీ ఆసుప్రతిలోని అవసరాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ సేవలు అందించేందుకు వీలుగా ఈ ఏర్పా ట్లు చే స్తున్నామని, దీనికి సంబంధించి గత ఏడాదిలోనే నిర్ణయం జరిగిందని, ఇప్పటికిప్పుడు కొత్తగా తీసుకువచ్చిన ఉత్తర్వులేమీ కాదని వివరించారు. ఈ వ్యాధి కలిగిన వారికి ఇప్పటికే గాంధీలో అనేక మందికి సేవలు అందుతున్నాయని, డిమాండ్ అధికంగా ఉండడంతో ఈ విభాగాన్ని తరలిస్తే మరింత మందికి సేవలు అందించే అవకాశముంటుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ విభాగానికి సంబంధించిన ప్రొ ఫెసర్లు, డాక్టర్లు, ఉద్యోగులతో పాటు సిబ్బందిని బ లవంతంగా తరలించే ప్రసక్తే లేదన్నారు. ఇటు ఉస్మానియాతో పాటు అటు గాంధీలోనూ ఈ సేవ లు అందుబాటులోనే ఉంటాయని తెలిపారు. గాం ధీలో కేవలం మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఉందని, సర్జికల్ లేదనే ఉద్దేశంతో తరలింపు ప్రక్రియపై దృష్టి సారించినట్లు డిఎంఇ వివరించారు.