YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పోలీసులు గులాంగిరి చేస్తున్నారు ఈటల రాజేందర్

పోలీసులు గులాంగిరి చేస్తున్నారు ఈటల రాజేందర్

మెదక్
అంజయ్య గారి సతీమణి పద్మ, కుమారుడు సంతోష్ ఆత్మహాత్యలు కావు. ఇది  ప్రభుత్వ హత్యలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈటల మాట్లాడుతూ ప్రగతి భవన్ లో కూర్చొని..  పార్టీ వారు ఏమన్నా చేసుకోండి కేసులు ఉండవు అని కెసిఆర్ చెప్పడమే దీనికి కారణం. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులపై రౌడీ షీట్లు ఓపెన్ చేసి.. ఆర్థిక దిగ్బంధం చేసి.. లొంగ దీసుకుంటున్నారు.  డీజీపీ గారు మీరు ఊర్లో పుట్టి పెరిగిన వారు, తెలంగాణ ప్రజలు ఎలా ఉంటారో తెలుసు, సుదీర్గకాలం ఇంటెలిజెన్స్ లో పనిచేసారు. మీరు ఐపిసి  ప్రకారం పని చేస్తున్నారా?  గులాం గిరీ చేస్తున్నారా ?  ప్రజలను కాపడలేక పోతున్నారని అన్నారు.
సీఎం ఉంటాడు పోతాడు, నాయకులు ఉంటారు పోతారు. కానీ పోలీసులు 30 ,40 ఏళ్లు విధులు నిర్వహించాలి. ఆత్మను చంపుకొని పనించేస్తే మిమ్ముల్ని చరిత్ర క్షమించదని హెచ్చరిస్తున్నా. ఇంటెలిజెన్స్ వ్యవస్థ దుర్మార్గాలు మీద కన్ను వేయాలి.. కానీ మీరు రాజకీయ నాయకుల మీద వారి సెల్ ఫోన్ ల మీద నిఘా పేట్టి వేధిస్తున్నారు. సిరిసిల్ల ఇసుక దందకి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డు మీదకు వస్తె.. ఇసుక దందా చేసేవారు అందరూ మీ కులపోల్లు కాబట్టి.. వారిని వదిలిపెట్టి ప్రజలమీద కేసులు పెట్టిన చరిత్ర మీది.  సీఎం ప్రవర్తన సీఎం అయ్యాక మారిపోయింది. ఇప్పుడు మిమ్మిల్ని చూసి తెలంగాణ ప్రజలు ఈయనా మా సీఎం అని నీచంగా చూస్తున్నారు. తు అనే స్థాయికి సీఎం దిగజారి పోయారు.  ఒకప్పుడు మిమ్ముల్ని తెలంగాణ గాంధీ గా అనుకున్నారు కనే మీరు గాంధీ కాదు తెలంగాణ  ద్రోహ.  ఈ సీఎం వెంటనే  రాజీనామా చేయాలి.  డీజీపీ కూడా ఒక్క నిమిషం కూడా ఆ కుర్చీలో కూర్చోవడానికి వేలు లేదు.  ఆ కుర్చీ మీకు రాజ్యాంగ బద్దంగా వచ్చింది... అది మర్చిపోవద్దు. డీజీపీ కి ఫోన్ చేస్తే అందుబాటులో ఉండరు.  డిఎస్పీ మాట్లాడరు. ఎసిపి స్పందించరు. ఇంత బానిసలా?  ప్రజల డబ్బులు చెల్లిస్తే వాటితో మీకు జీతాలు వస్తున్నాయి. ప్రజలకు జీతగాల్లు అని మర్చిపోకండి.  వీరి అరాచకాలు చెప్తే ఒడవదని అన్నారు.
మిస్టర్ హరీష్ రావు.. నీ గడ్డ మీద నుండి అడుగుతున్న హుజూరాబాద్ లో ఖర్చు పెట్టిన  600 కోట్లు నీ ఆస్థి అమ్మి తెచినవ? మీ మామ ఆస్తి అమ్మి తెచ్చినవా ? అన్ని చేసిన కర్రుకల్చి వాత పెట్టినా కూడా బుద్ది రాని పార్టీ మీది. హుజూరాబాద్ గెలుపే. తెలంగాణ అంత అదే రిపీట్ అవుతుంది. మిమ్ముల్ని  పల్లెల్లో తరిమి తరిమి కొడతారు.  పోలీసులు.. నీ లంచాలు తీసుకున్న కార్యకర్తలు ఎవరు కాపడలేరు.  విచారణ జరిపి కఠినంగా శిక్ష వేయాలి.  ఆత్మ హత్యలు కావు ప్రభుత్వ హత్యలు. సిఐ లే పోలీస్ స్టేషన్లో కూర్చొని ప్రజలను వేధిస్తుంటే ప్రజలు ఎవరికీ చెప్పాలి.  అంత నీచం  అయిన వాడు పోలీస్ డ్రెస్ వేసుకోవడానికి అర్హుడు కాడు.  వీరి ఆత్మహత్యకు కారణం అయిన వారు అందరినీ హత్యానేరం కింద అరెస్ట్ చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నా. దౌర్జన్యం చేస్తే చీల్చి చెందాడుతామని అన్నారు.

Related Posts