YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేంద్రంపై కేటీఆర్ సెటైర్లు

కేంద్రంపై కేటీఆర్  సెటైర్లు

హైదరాబాద్, ఏప్రిల్ 19,
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను వరుసగా ఎండగడుతూ వస్తున్నారు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్.. తాను ఈ మధ్య ఏ సభలో పాల్గొన్న కేంద్రం విధానాలను తప్పుబడుతున్నారు.. ఇక, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆయన.. ట్విట్టర్‌ వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు.. వరుస ట్వీట్లతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. 30 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం అనే ఓ జాతీయ మీడియా కథనాన్ని షేర్‌ చేసిన మంత్రి కేటీఆర్.. అందులో పేర్కొన్న అన్ని అంశాలను వివరిస్తూ.. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, మంత్రి కేటీఆర్‌ తాజా ట్వీట్‌ విషయానికి వస్తే.. “45 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం చేరుకుంది… 30 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం పెరిగింది.. గతంలో ఎన్నడూ లేనంతగా… ఇంధన (పెట్రోల్, డీజిల్) ధరలు ఆల్‌ టైం హైని తాకాయి.. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఎల్పీజీ సిలిండర్‌ పెరిగిపోయాయి.. ఇక, వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతున్నామని ఆర్బీఐ చెబుతోంది..’ అంటూ రాసుకొచ్చిన కేటీఆర్.. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమని పిలవాలని ప్రశ్నించారు. ప్రతిభ చూపించని ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతారంటూ ఎన్డీఏ సర్కార్‌పై మండిపడుతూ ట్వీట్‌ చేశారు మంత్రి కేటీఆర్.

Related Posts