అనంతపురం
కళ్యాణదుర్గంలో టీడీపీ కి చెందిన ఉమామహేశ్వర్ నాయుడు చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు రాష్ట్ర స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్. కళ్యాణదుర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చి శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. బీసీ మహిళ కు మంత్రి పదవి లభించడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఓర్వలేకుండా ఉన్నారన్నారు. ప్రజల మద్దతు కోల్పోయిన రాజకీయాలు చేయడం టిడిపి వారికే చెందుతుందన్నారు.రాష్ట్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ లో మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యం అన్నారు. క్యాబినెట్ విస్తరణ లో 45 శాతం బీసీలకు ప్రాధాన్యత కలిగిన జగనన్నకే సాధ్యమైందని చెప్పారు.