హైదరాబాద్
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సోమవారం నాడు ప్రజా సంగ్రామ యాత్రలో పార్టీ నాయకులు లు మరియు బిజెపి లీగల్ సెల్ బృందంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బిజెపి ప్రతినిధి బృందం బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు &శాసనసభ్యులు ఈటల రాజేందర్ , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, శాసనసభ్యులు & బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఎం.రఘునందనరావు మరియు పార్టీ నాయకులు నేడు రామాయంపేట పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న తల్లి కొడుకుల కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ సంఘటనపై సి బి ఐ విచారణ జరగాలని బిజెపి డిమాండ్ చేస్తున్నదని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి అన్నారు.
టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలకు ఎవరు ఆత్మహత్య లకు పాల్పడ్డ కూడదు. బాధితులకు అండగా బిజెపి ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అకృత్యాలు, అరాచకాలపై బిజెపి పోరాటం చేస్తోంది. అదేవిధంగా ఖమ్మంలో మరో బృందం బిజెపి లీగల్ సెల్ బృందం సాయి గణేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బుధవారం రామాయంపేటలో బిజెపి లీగల్ సెల్ బృందం పర్యటిస్తుంది. డు ఖమ్మంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సూచన మేరకు తమిళనాడు రాష్ట్ర సహా ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి లీగల్ సెల్ బృందం తో పాటు పాల్గొన్నారు. ఐ టి &స్కిల్ డెవలప్మెంట్ శాఖ కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం ఖమ్మంలో పర్యటిస్తారు. సాయి గణేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారుఅలాగే, రాష్ట్ర గవర్నర్ను బిజెపి బృందం కలిసి రామయంపేట్, ఖమ్మం ఆత్మహత్యలు విషయాన్ని వివరించడం జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ప్రోత్సాహంతో చేస్తున్న అకృత్యాలను, దాడులను, టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న దాడులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్దాం. న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను కాపాడాలని కోరుతామని అయన అన్నారు.